Rs. 5LAKHS DONATED TO BIRRD TRUST _ గుబ్బా స‌త్రం వార్షికోత్స‌వం సంద‌ర్భంగా బ‌ర్డ్ ట్ర‌స్టుకు రూ. 5 ల‌క్ష‌లు విరాళం

Tirumala, 6 Feb. 21: On the occasion of the 33rd Anniversary of Gubba Choultry located at Tirumala, the authorities donated Rs. 5lakhs to BIRRD Trust of TTD. 

The Choultry Trust Chairman Sri Aswini Kumar along with Managing Trustee Sri Jeevan Kumar handed over the cheque for the same amount to TTD Trust Board Chairman Sri YV Subba Reddy on Saturday in a special programme arranged in Gubba Choultry. 

Board member Sri Chippagiri Prasad was also present. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గుబ్బా స‌త్రం వార్షికోత్స‌వం సంద‌ర్భంగా బ‌ర్డ్ ట్ర‌స్టుకు రూ. 5 ల‌క్ష‌లు విరాళం

తిరుమల, 06 ఫిబ్ర‌వ‌రి 2021: తిరుమ‌ల‌లోని గుబ్బా స‌త్రం 33వ వార్షికోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని గుబ్బా ట్ర‌స్టు ఛైర్మ‌న్ శ్రీ అశ్వ‌నీకుమార్‌, మేనేజింగ్ ట్ర‌స్టీ శ్రీ జీవ‌న్‌కుమార్ శ‌నివారం బ‌ర్డ్ ట్ర‌స్టుకు రూ.5 ల‌క్ష‌ల విరాళాన్ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.‌సుబ్బారెడ్డికి అందించారు. సత్రం వార్షికోత్స‌వానికి టిటిడి ఛైర్మ‌న్‌ను ఆహ్వానించారు. సత్రంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఈ మేర‌కు విరాళం అందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి బోర్డు స‌భ్యులు శ్రీ చిప్ప‌గిరి ప్ర‌సాద్‌ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.