RUDAYAGAM CONCLUDES _ కపిలతీర్థంలో ముగిసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం

Tirupati, 24 Nov. 19:The 11th day Rudra Yagam of Kapileswara Swamy Homam concluded on a grand religious note in Sri Kapileswara Swamy temple in Tirupati on Sunday. 

As a part of the month long Karthika Homa Mahotsavams at Sri Kapileswara Swamy temple, this fete was performed. 

On Monday Kalabhairava Homam will be observed. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

కపిలతీర్థంలో ముగిసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం

తిరుపతి, 2019 నవంబరు 24: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో హోమ మహోత్సవాల్లో భాగంగా పదకొండు రోజుల పాటు జరిగిన శ్రీ కపిలేశ్వస్వామివారి హోమం ఆదివారం ఘనంగా ముగిసింది.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు రుద్రయాగ సమాప్తి, మహాపూర్ణాహుతి, మహాశాంతి అభిషేకం, కలశ ఉద్వాసన, కలశాభిషేకం, హారతి నిర్వహించారు. సాయంత్రం 6.00 గంట‌ల‌కు శ్రీ కాలభైరవస్వామివారి కలశస్థాపన, కలశ ఆరాధన, హోమం, నివేదన, హారతి నిర్వహిస్తారు. నవంబరు 25వ తేదీ సోమ‌వారం శ్రీ కాలభైరవస్వామివారి హోమం
జరుగనుంది.

గృహస్తులు రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.