RUDRA YAGAM BEGINS _ శ్రీ కపిలేశ్వరాలయంలో రుద్ర‌యాగం ప్రారంభం

TIRUPATI, 22 NOVEMBER 2021: Rudra Yagam commenced in Sri Kapileswara Swamy temple on Monday as a part of ongoing Karthika Masa Homa Mahotsavams.

This fete will last till December 2 for 11 days.

Board member Sri P Ashok Kumar, DyEO Sri Subramaniam and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో రుద్ర‌యాగం ప్రారంభం

తిరుప‌తి‌, 2021 న‌వంబ‌రు 22: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి హోమం (రుద్ర‌యాగం) సోమ‌వారం శాస్త్రోక్తంగా ప్రారంభ‌మైంది. నెల రోజుల పాటు జరుగుతున్నహోమ మహోత్సవాల్లో భాగంగా డిసెంబ‌రు 2వ తేదీ వ‌రకు 11 రోజుల పాటు ఈ హోమం నిర్వ‌హిస్తారు.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ‌, రుద్ర‌జ‌పం, హోమం, ల‌ఘు పూర్ణాహుతి, నివేద‌న, హార‌తి నిర్వహించారు. సాయంత్రం పూజ‌, జ‌పం, హోమం, రుద్ర‌త్రిశ‌తి, బిల్వార్చ‌న‌, నివేద‌న‌, విశేష‌దీపారాధ‌న, హార‌తి ఇస్తారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, ఆలయ‌ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.