SACRED GARDENS FOR SRIVARI SEVAS SAYS TTD CHAIRMAN _ శ్రీవారి సేవకు పవిత్ర ఉద్యానవనాలు : టిటిడి ఛైర్మెన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి
PROMOTING SACRED GARDENS IN TIRUMALA
Tirumala, 7 Jan. 21: TTD Chairman Sri YV Subba Reddy said on Thursday that henceforth TTD will Promote Gardens in Tirumala Exclusively for Growing Scented leaves, Pavitra and Flowers.
Accompanied by TTD EO Dr KS Jawahar Reddy and Additional EO Sri AV Dharma Reddy, the TTD chairman planted some Pavitra Plants at Sila Thoranam near Gogarbam Dam.
Speaking to reporters on the occasion the TTD Chairman said as mentioned in Puranic legends TTD is setting up a Sri Venkateswara Pavitra udyanavanam over 10 acres at Sila Thoranam to grow seven types of scented leaves and 25 other varieties of flower plants.
He said an amount of Rs.1.5 crore will be spent on the gardens including that of Sandalwood and Red Sanders wood at the Sri Venkateswara Sandalwood Pavitra gardens.
DFO Sri Chandrasekhar, VGO Sri Bali Reddy, Health officer Dr RR Reddy, FROs, Sri Prabhakar Reddy, Sri Venkateswara Subbaiah, Swami Vivekananda and forest staff were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీవారి సేవకు పవిత్ర ఉద్యానవనాలు : టిటిడి ఛైర్మెన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి
పవిత్ర ఉద్యానవనాల పెంపకానికి శ్రీకారం
తిరుమల, 2021 జనవరి 07 : శ్రీవారి సేవకు వినియోగించే పుష్పాలు, పత్రాలకు సంబంధించిన మొక్కలతో తిరుమలలో పవిత్ర ఉద్యానవనాలు ఏర్పాటు చేస్తున్నట్లు టిటిడి ఛైర్మెన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలోని శిలా తోరణం, గోగర్భం డ్యామ్‌ల వద్ద ఛైర్మన్, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డితో కలిసి గురువారం సాయంత్రం పవిత్ర మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా టిటిడి ఛైర్మెన్ మీడియాతో మాట్లాడుతూ పురాణాల్లో పేర్కొన్న విధంగా శ్రీవారి పుష్ప కైంకర్యానికి వినియోగించే మొక్కలతో శిలా తోరణం వద్ద 10 ఎకరాల్లో శ్రీ వేంకటేశ్వర పవిత్ర ఉద్యానవనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో ఏడు ఆకులు కలిగిన అరటితోపాటు, తులసి, ఉసిరి, మోదుగ, జువ్వి, జమ్మి, దర్భ, సంపంగి, మామిడి, పారిజాతం, కదంబం, రావి, శ్రీగంధం, అడవి మల్లి, మొగలి, పున్నాగ, అశోక, పొగడ, ఎర్ర గన్నేరు, తెల్ల గన్నేరు, నాబి, మాదిఫల, బొట్టుగు, భాందిరా వంటి 25 రకాల మొక్కలు ఉన్నట్లు తెలిపారు.
అదేవిధంగా శ్రీ వేంకటేశ్వర శ్రీగంధపు పవిత్ర ఉద్యానవనంలో శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు పెంచనున్నట్లు తెలిపారు. దాదాపు రూ.1.5 కోట్లతో ఈ ఉద్యానవనాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో డిఎఫ్‌వో శ్రీ చంద్రశేఖర్, విజివో శ్రీ బాలిరెడ్డి, ఆరోగ్య విభాగాధికారి డా.ఆర్.ఆర్.రెడ్డి, ఎఫ్.ఆర్.వోలు శ్రీ ప్రభాకర్ రెడ్డి, శ్రీ వెంకట సుబ్బయ్య, శ్రీ స్వామి వివేకానంద, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.