SACRED PAVITRA SAMARPANA AT TIRUCHANOOR _ శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్ర సమర్పణ

Tirupati, 06 September 2025: As part of the ongoing Pavitrotsavams at Sri Padmavathi Ammavari Temple in Tiruchanoor on the second day Pavitra Samarpana was observed with religious fervour on Saturday.

The day commenced with Suprabhatam, followed by Sahasranamarchana and Nityarchana. 

Later, at 11.30 a.m., the sacred Pavitra Samarpana was performed. Pavitrams were ceremoniously offered to the presiding deity, processional deities, sub-temples, parivara devatas, vimana prakaram, and the temple pole.

In the evening, between 6pm and 8pm, Vedic rituals including worship, homams, nivedana, and teertha prasada goshti will be conducted in the Yagashala.

The Temple Deputy EO Sri Harindranath, AEO Sri Devarajulu, Archakas, and temple staff were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్ర సమర్పణ

తిరుపతి, 2025, సెప్టెంబర్ 06: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు.

ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చ‌న‌ చేపట్టారు. ఆ తరువాత ఉద‌యం 11.30 గంటల నుండి పవిత్ర సమర్పణ నిర్వ‌హించారు. ఇందులో అమ్మ‌వారి మూలమూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, ప‌రివార దేవ‌త‌ల‌కు, విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు.

కాగా, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో ఆరాధన, హోమాలు, నివేదన, తీర్థప్రసాద గోష్టి తదితర వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

సెప్టెంబర్ 07వ తేదీ ఆదివారం ఉదయం సుప్రభాతం అనంతరం సహస్రనామార్చన, నిత్యార్చన శుద్ధి చేపడుతారు. అనంతరం యాగశాలకు ఉత్సవమూర్తులు వేంచేపు చేస్తారు. యాగశాలలో హోమాలు, మహాపూర్ణాహుతి, శాంతి హోమం, పవిత్ర విసర్జనము, నివేదన, కుంభప్రోక్షణ, తీర్థప్రసాద వినియోగం చేపడుతారు. ఉదయం 10.00 గం.ల నుండి 11.30 గం.ల వరకు శ్రీకృష్ణస్వామి మఖమండపంలో స్నపన తిరుమంజనం, చక్రస్నానం చేపడుతారు. అటు తర్వాత పలు వైదిక కార్యక్రమాల తర్వాత ఆదివారం చంద్రగ్రహణంలో భాగంగా మధ్యాహ్నం 02.15 గం.లకు ఆలయాన్ని మూసివేస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, ఆలయ అర్చ‌కులు, సూప‌రింటెండెంట్ శ్రీ రమేశ్, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ లు పాల్గొన్నారు.

టీటీడీ ప్రధాన ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.