SADGAMAYA PROGRAMME IN TTD SCHOOLS ON JULY 28 _ జూలై 28న టిటిడి పాఠశాలల్లో సద్గమయ
Tirumala, 25 July 2025: The Tirumala Tirupati Devasthanams (TTD), in collaboration with the Hindu Dharma Prachara Parishad (HDPP), will launch the ‘Sadgamaya’ programme on July 28, aimed at imparting training to the students on human values, moral ethics, and personality development.
The programme will be conducted in the following seven TTD-run schools:
1. S.G.S. High School, Tirupati
2. S.V. Oriental High School, Tirupati
3. S.V. High School, Tirupati
4. S.K.R.S. English Medium School, Tirupati
5. S.P. Girls High School, Tirupati
6. S.K.S. High School, Tatithopu
7. S.V. High School, Tirumala
The training is intended for Day Scholars of Classes 8, 9, and 10. A team of 70 trained teachers will deliver interactive and insightful sessions on the following key areas:
Personality development
Spiritual, moral, and social values
Life skills and leadership qualities
Indian culture and traditions
Real-world understanding and responsible citizenship
The programme will run for four days, with one-hour sessions each day in all seven schools.
This initiative is part of TTD\’s ongoing efforts to instill ethical and cultural awareness among young students, helping them grow into responsible and value-driven individuals.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూలై 28నటిటిడిపాఠశాలల్లోసద్గమయ
తిరుపతి, 2025 జూలై 25: తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా జూలై 28వ తేదీన టిటిడి పాఠశాలల్లోని విద్యార్థులకు మానవీయ, నైతిక విలువు, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇచ్చేందుకు సద్గమయ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో 1. తిరుపతిలోని ఎస్.జీ.ఎస్. హైస్కూల్, 2. ఎస్వీ ఓరియంటల్ హైస్కూల్, 3. ఎస్వీ హైస్కూల్, 4. ఎస్.కె.ఆర్.ఎస్ ఇంగ్లీషు మీడియం స్కూల్ , 5. ఎస్పీ బాలికల పాఠశాల, 6. తాటితోపులోని ఎస్.కె.ఎస్. హైస్కూల్, 7. తిరుమలలోని ఎస్వీ హైస్కూల్ లలోని 8, 9, 10 తరగతుల డే స్కాలర్ల విద్యార్థులకు ఎంపిక చేయబడ్డ శిక్షకులచే శిక్షణ ఇవ్వనున్నారు.
సద్గమయ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, ఆధ్యాత్మిక, సామాజిక, నైతిక విలువలు, నైపుణ్యాలు, సంస్కృతి – సాంప్రదాయాలు, వాస్తవ ప్రపంచాన్ని అధ్యయనం చేయడం, వ్యక్తిగత పురోగతి, సామరస్యం, సమాజంలో భాగస్వామ్యం, నాయకత్వ లక్షణాలు తదితర అంశాలపై విశ్లేనాత్మకంగా శిక్షణ పొందిన 70 మంది ఉపాధ్యాయులచే శిక్షణ ఇవ్వనున్నారు.
తిరుపతి, తిరుమలలోని 7 పాఠశాలల్లో డే స్కాలర్లకు రోజుకు ఒక గంట చొప్పున 4 రోజుల పాటు సద్గమయ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తారు.
టిటిడిప్రధానప్రజాసంబంధఅధికారిచేవిడుదలచేయబడినది.
