SAHASRA KALASHABHISHEKAM AND HANUMANTHA VAHANA SEVA AT SRI KODANDARAMA SWAMY TEMPLE _ శ్రీ కోదండరామాలయంలో వైభవంగా సహస్రకలశాభిషేకం, హనుమంత వాహన సేవ

శ్రీ కోదండరామాలయంలో వైభవంగా సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ

తిరుప‌తి, 2025 ఆగ‌స్టు 23: తిరుపతిలోని శ్రీకోదండరామాలయంలో శ‌నివారం అమావాస్య సందర్భంగా సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ వైభవంగా జరిగాయి.

వైఖానస ఆగమం ప్రకారం వైష్ణవాలయాల్లో పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ‌ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్రాలకు చాలా విశిష్టత ఉంటుంది. అమావాస్య నాడైన శ‌నివారం ఉదయం 9 నుండి 10.30 గంటల నడుమ సహస్ర కలశాభిషేకం సేవ వైభవంగా నిర్వహించారు. రూ.500/- చెల్లించి పాల్గొన్న గృహస్తులకు(ఇద్దరు) ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేశారు.

కాగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హనుమంత వాహనసేవ వేడుకగా జరుగనుంది. సర్వాలంకార భూషితులైన శ్రీకోదండరామస్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన హనుమంత వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రామభక్తుడైన హనుమంత వాహనసేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి నాగ‌ర‌త్న‌, ఏఈవో శ్రీ ర‌వి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ రమేష్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirupati, August 23, 2025: At Sri Kodandarama Swamy Temple, Tirupati, the auspicious occasion of Amavasya was observed on Saturday with Sahasra Kalashabhishekam in the morning and Hanumanta Vahana Seva in the evening.

The Sahasra Kalashabhishekam was performed between 9:00 AM and 10:30 AM as per Vaikhanasa Agama traditions. Devotees who participated in the seva by offering 500 were presented with vastrams, a laddu, and a vada as prasadam.

Later, from 7:00 PM to 9:00 PM, Sri Kodandarama Swamy, richly adorned, paraded on Hanumanta Vahanam along the four Mada streets, blessing devotees who turned up in large numbers to witness the divine spectacle.

The event was attended by Deputy EO Smt. Nagaratna, AEO Sri Ravi, Temple Inspector Sri Ramesh, temple priests, officials, and devotees.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI