SAKSHATKARA VAIBHAVOTSAVAMS WITNESS HANUMANTA VAHANAM _ హ‌నుమంత వాహ‌నంపై శ్రీ కల్యాణ శ్రీనివాసుడు అభ‌యం

Tirupati, 11 July 2024: On the second day of the three-day annual  Sakshatkara Vaibhavotsavams on Thursday, Sri Kalyana Venkateswara took out a celestial ride on Hanumanta Vahanam to bless His devotees.

Earlier during the day, Snapana Tirumanjanam was performed to the Utsava deities.

Special Gr DyEO Smt Varalakshmi, AEO Sri Gopinath and others were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

హ‌నుమంత వాహ‌నంపై శ్రీ కల్యాణ శ్రీనివాసుడు అభ‌యం

– ఘ‌నంగా సాక్షాత్కార వైభవోత్సవాలు

తిరుపతి, 2024 జూలై 11: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జ‌రుగుతున్న సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాల్లో రెండో రోజైన గురువారం రాత్రి స్వామివారు హ‌నుమంత వాహ‌నంపై భ‌క్తుల‌కు అభయమిచ్చారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.

అనంతరం రాత్రి 7 గంటల నుండి హ‌నుమంత వాహనంపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. జూలై 12న గరుడ వాహన‌సేవ జ‌రుగ‌నుంది.

ఈ కార్యక్రమంలో ఆల‌య ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపీనాథ్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలు భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.