SAMPROKSHANA PERFORMED _ శ్రీరామచంద్ర ఉత్సవ మూర్తికి అంగుళీ సంధాన సంప్రోక్షణం
TIRUMALA, 20 NOVEMBER 2024: Special pujas were performed for the ceremonial idols of Sri Sita Lakshmana Sameta Sri Ramachandra Murthy at the Tirumala temple on Wednesday morning.
Going into the details, in the year 2021, a minor fracture was identified in the middle finger of the left hand in the Utsava idol of Sri Rama. At that time, the fracture that had formed was repaired by covering this finger with a golden shield.
Usually, when such small fractures occur in the ceremonial idols, it is customary to repair them during the Maha Samprokshana program that is being held once in 12 years.
However, the Maha Samprokshana program was organized by TTD in 2018. The next Maha Samprokshana program will be held in 2030.
Since there are more than five years left, a committee consisting of Jeeyar Swamijis, Agama advisors and priests recently brought it to the attention of the present TTD higher authorities during the recent annual Brahmotsavams in Tirumala and the authorities inturn requested the committee members to organise a Samprokshana program.
Following the dates as decided by the committee, the current TTD management has also agreed to organize the Sri Rama ”Anguli Sandhana Samprokshana” program in Tirumala temple on Tuesdays and Wednesdays to correct minor fractions.
As a part of the rituals held at Sampangi Prakaram inside the temple initially on Tuesday night Kalapakarshana, Bimba Vastu, Mahashanti Tirumanjanam, Sayanadhivasam were performed as per the tenets of Vaikhanasa Agama.
Later on Wednesday morning, special homam followed by Purnahuti and Kalavahanam were performed.
In the presence of Tirumala Pontiffs, the Chief Priests of Tirumala including Sri Venugopala Deekshitulu, Sri Krishna Seshachala Deekshitulu and Sri Govindaraja Deekshitulu performed the rituals amidst chanting of relevant Mantras by the Vedic Pundits.
TTD Additional EO Sri Venkaiah Chowdary and other temple officials and staff were present.
Meanwhile, following the advent of Punarvasu Star, these Utsava deities will bless devotees during Sahara Deepalankara Sevas on Wednesday evening.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీరామచంద్ర ఉత్సవ మూర్తికి అంగుళీ సంధాన సంప్రోక్షణం
తిరుమల, 2024 నవంబరు 20: తిరుమల ఆలయంలో బుధవారం ఉదయం శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మూర్తి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వివరాల్లోకి వెళ్తే 2021 సంవత్సరంలో శ్రీరాముల వారి విగ్రహానికి సంబంధించిన ఎడమచేయి మధ్య వేలి భాగంలో చిన్నపాటి భిన్నం ఏర్పడినట్లు గుర్తించారు. అప్పట్లో ఈ వేలుకు బంగారు కవచాన్ని తొడిగి ఏర్పడిన భిన్నాన్ని సవరించమైనది.
సాధారణంగా ఇటువంటి చిన్నపాటి భిన్నాలు ఉత్సవమూర్తులకు ఏర్పడినప్పుడు 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహా సంప్రోక్షణ కార్యక్రమంలో సవరించడం పరిపాటి.
అయితే మహా సంప్రోక్షణ కార్యక్రమం 2018లో టీటీడీ నిర్వహించింది. తదుపరి మహా సంప్రోక్షణ కార్యక్రమం 2030లో జరగనుంది. అందుకు ఐదు సంవత్సరాలకు పైగా సమయం ఉన్న కారణంగా జీయర్ స్వాములు, ఆగమ సలహాదారులు, అర్చకులతో కూడిన కమిటీ ఇటీవల బ్రహ్మోత్సవ సమయంలో ప్రస్తుత అధికారుల దృష్టికి తీసుకురాగా, సదరు సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులు కోరారు .
ఈ కమిటీ నిర్ణయించిన మేరకు చిన్నపాటి భిన్నాలను ఆగమోక్తంగా సవరించేందుకు మంగళ, బుధవారాల్లో శ్రీరాములవారి ఎడమ చేయి అంగుళీ సంధాన సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రస్తుత టీటీడీ యాజమాన్యం కూడా అంగీకరించింది.
ఈ కార్యక్రమం ద్వారా ఉత్సవ విగ్రహాలకు ఎటువంటి దోషం ఉండదని కూడా కమిటీ తెలిపింది.
కాగా సంపంగి ప్రాకారంలో జరిగిన ఈ క్రతువుల్లో భాగంగా ముందుగా మంగళవారం రాత్రి వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం కళాపకర్షణ, బింబ వాస్తు, మహాశాంతి తిరుమంజనం, శయనాధివాసం పూజలు నిర్వహించారు.
అనంతరం బుధవారం ఉదయం ప్రత్యేక హోమం నిర్వహించి పూర్ణాహుతి, కళావాహన కార్యక్రమాలు నిర్వహించి ఉత్సవ మూర్తి లో ఉన్న చిన్నపాటి భిన్నాన్ని శాస్త్రోక్తంగా సవరించడమైనది.
తిరుమల జీయర్ స్వామీజీల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య తిరుమల ప్రధాన అర్చకులు శ్రీ వేణు గోపాల దీక్షితులు, శ్రీ కృష్ణ శేషాచల దీక్షితులు, శ్రీ గోవిందరాజ దీక్షితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, ఇతర ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కాగా పునర్వసు నక్షత్రం సందర్భంగా బుధవారం సాయంత్రం సహస్ర దీపాలంకార సేవలో శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మూర్తి
భక్తులను అనుగ్రహిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.