SANDAL POWDER FESTIVAL OF SRI BHASHYAKARA HELD GRANDLY _ ఘనంగా శ్రీ భాష్యకారుల గంధపు పొడి ఉత్సవం
Tirupati, April 23, 2026: The Sandal Powder Festival of Sri Bhashyakara was held grandly on Thursday at Sri Govindaraja Swamy Temple, Tirupati. Special rituals were performed on the occasion.
As part of the concluding day of the Bhashyakara Utsavams, sandal powder abhishekam was offered to Sri Bhashyakara.
Later, the deity was taken in procession along the four Mada streets, followed by Asthanam.
The sandal decoration held special significance and offered a spiritual experience to devotees.
Sri Pedda Jeeyar Swamy, Sri Chinna Jeeyar Swamy, temple officials and priests participated in the event.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఘనంగా శ్రీ భాష్యకారుల గంధపు పొడి ఉత్సవం
తిరుపతి, 2026 ఏప్రిల్ 23: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకారుల గంధపు పొడి ఉత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
భాష్యకార ఉత్సవాల్లో చివరి రోజుగా గంధపు పొడి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ భాష్యకారుల వారికి గంధపు పొడితో అభిషేకం చేశారు.
అనంతరం స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇచ్చారు. తరువాత ఆస్థానం జరిగింది.
ఈ ఉత్సవంలో గంధాలంకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండగా, భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించింది.
ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.


