SANGOPANGA SRI SRINIVASA VISHWASHANTI MAHA YAGAM COMMENCES _ సంగోపాంగ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం ప్రారంభం
Tirumala, 17 August 2025: The Sangopanga Sri Srinivasa Vishwashanti Mahayagam commenced in a grand manner on Sunday evening at Sri Venkateswara Veda Vignana Peetham, Dharmagiri, Tirumala, with the noble objective of praying for the prosperity, longevity, health, and wealth of devotees.
This Mahayagam will be conducted for four days, up to August 20. On the inaugural day at 6 PM, traditional Vedic rituals such as Acharya Varanam, Medini Puja, Mritsangrahanam, Ankurarpanam, and Vedarambham were performed with due sanctity.
A total of 32 eminent Vedic scholars are participating in this sacred Mahayagam. During the course of the Yagam, Veda Parayanam, Sundarakanda Parayanam, and various other Vedic rituals will be performed.
The Mahayagam will conclude with Poornahuti on August 20.
TTD Additional EO Sri Ch Venkaiah Chowdary, Principal Sri KSS Avadhani and others were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
సంగోపాంగ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం ప్రారంభం
తిరుమల, 2025 ఆగస్టు 17: భక్తుల ఐశ్వర్యం, ఆయురారోగ్య సంపదలు కాంక్షిస్తూ తిరుమల ధర్మగిరిలోని శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠంలో ఆదివారం సాయంత్రం నుండి సంగోపాంగ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం ఘనంగా ప్రారంభమైంది.
ఈ మహాయాగం ఆగస్టు 20వ తేది వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించబడుతుంది. తొలి రోజు సాయంత్రం 6 గంటలకు ఆచార్యవరణం, మేదినీ పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణం, వేదారంభం కార్యక్రమాలు వైదికంగా నిర్వహించారు.
మొత్తం 32 మంది వేదపండితుల సమక్షంలో జరిగే ఈ మహాయాగంలో వేదపారాయణం, సుందరకాండ పారాయణం తదితర వైదిక క్రతువులు జరుగుతాయి. ఆగస్టు 20న పూర్ణాహుతితో యాగం ముగుస్తుంది.
ఈ మహాయాగంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఎస్వీ వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని, ఇతర అధికారులు, పాల్గొన్నారు.








