SAPTA DWARA CONCEPT MUSES DEVOTEES _ సప్త ద్వారాలతో వైకుంఠాన్ని తలపించిన శ్రీవారి కల్యాణవేదిక
TRADITIONAL AND EXOTIC FLOWERS COMPETE STAGE DECORATION
Amaravathi /Tirumala, 15 March 2025: The Sapta Dwara decoration of Kalyana Vedika mused the devotees who thronged to witness celestial Srinivasa Kalyanam on Saturday evening at Venkatapalem.
The entire stage was tastefully and colourfully decked with over 04 tonnes of traditional, ornamental, exotic flowers besides 30 thousand numbers of cut flowers competed with each other to enhance the beauty of the venue hosting the divine wedding ceremony.
Apart from the flowers, the combination of African oranges with green and red apple, black and green grapes besides coconut blossom, sugar canes, mango leaves provided a delightful feast to the eyes of devotees in the venue.
Under the supervision of the TTD Garden department, gardeners, flower experts from Bengaluru and Hyderabad made the splendid decorations.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సప్త ద్వారాలతో వైకుంఠాన్ని తలపించిన శ్రీవారి కల్యాణవేదిక
అమరావతి / తిరుమల 2025 మార్చి 15: వెంకటపాలెం శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో టిటిడి ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన కల్యాణవేదిక సప్త ద్వారాలు, ఆనంద నిలయంతో వైకుంఠాన్ని తలపిస్తోంది. రంగురంగుల పుష్పాలు, ఫలాలతో చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. చల్లటి సాయంత్రం వేళ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులు ఫలపుష్పాల అలంకరణ చూసి ముగ్ధులయ్యారు.
చెరుకులు, టెంకాయపూత, అరటి ఆకులు, మామిడాకులు, మామిడికాయలు, ఆఫ్రికన్ ఆరంజ్, గ్రీన్ ఆపిల్, రెడ్ ఆపిల్, నలుపు, ఆకుపచ్చ ద్రాక్ష, దోస, మొక్కజొన్న తదితర ఫలాలు, నీలం ఆర్కిడ్, రెడ్ ఆంథూరియం తదితర విదేశీ జాతుల పుష్పాలతో కల్యాణవేదికను అలంకరించారు. సంప్రదాయం ఉట్టిపడేలా 4 టన్నుల సంప్రదాయపుష్పాలు, 30 వేల కట్ ఫ్లవర్స్, వివిధ రకాల ఫలాలు వినియోగించారు. ఇందులో టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన అలంకరణ నిపుణులు, టిటిడి సిబ్బంది ఇందుకోసం పనిచేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి, టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు , అధికారులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.