SARE TO GANGAMMA _ శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు సారె సమర్పించిన టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
TIRUPATI, 12 MAY 2022: In connection with the famous folk festival, Gangamma Jatara, TTD EO Sri AV Dharma Reddy has presented Sare to the folk Goddess in the Tataiahgunta Gangamma temple on Thursday.
Speaking to media on the occasion, he said, folk Goddess Gangamma is believed to be the sister of Sri Venkateswara Swamy. He said, according to the available historical evidences, Sri Anantalwar has consecrated the deity of Gangamma in this holy temple city.
In good olden days, even the devotees coming to Tirumala, first paid their visit to Gangamma temple before offering prayers to Sri Venkateswara Swamy, he maintained.
Local MLA Sri B Karunakar Reddy, Deputy Mayor Sri Abhinay Reddy, Gangamma temple board chief Sri Gopi, EO Sri Muni Krishna were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD TIRUPATI
శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు సారె సమర్పించిన టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుపతి, 2022 మే 12: తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు గురువారం టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు సారె సమర్పించారు. మే 10వ తేదీన చాటింపుతో మొదలైన గంగమ్మ జాతర మే 18వ తేదీ వరకు జరుగనున్న విషయం విదితమే. తుడ సర్కిల్ నుండి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి సారెను తీసుకెళ్లారు. అనంతరం ఈవో దంపతులు ఆలయ ప్రదక్షిణగా వెళ్లి గర్భాలయంలో అమ్మవారికి శేషవస్త్రాలు, పసుపుకుంకుమతో కూడిన సారెను సమర్పించారు.
ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారికి సోదరి అని ప్రతీతి అన్నారు.
శ్రీ అనంతాళ్వార్ ఇక్కడ గంగమ్మ అమ్మవారిని ప్రతిష్టించినట్టు తెలుస్తోందన్నారు..పూర్వం భక్తులు ముందుగా శ్రీ తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుని ఆ తరువాత తిరుమలకు వెళ్లేవారని తెలిపారు. ఆలయ అభివృద్ధికి టిటిడి తరపున సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంఎల్ఏ శ్రీ భూమన కరుణాకర్‌రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, ఉప మేయర్ శ్రీ భూమన అభినయ్‌రెడ్డి, గంగమ్మ ఆలయ పాలకమండలి అధ్యక్షులు శ్రీ కట్టా గోపి యాదవ్, ఈవో శ్రీ మునికృష్ణ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.