SARVA BHOOPALA VAHANAM OBSERVED _ సర్వభూపాల వాహనంపై శ్రీ బకాసుర వధ అలంకారంలో శ్రీ మలయప్ప
Tirumala, 27 September 2025: On the evening of Saturday of the ongoing annual Brahmotsavams, Sri Malayappa Swamy took out a celestial ride on Sarvabhoopala Vahanam along with Sridevi and Bhudevi to bless thousands of devotees waiting in the galleries Mada streets.
The Bakasuravadha concept has been displayed on the carrier.
Both the Pontiffs of Tirumala, Chairman Sri BR Naidu, EO Sri AK Singhal and others were also present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
సర్వభూపాల వాహనంపై శ్రీ బకాసుర వధ అలంకారంలో శ్రీ మలయప్ప
తిరుమల, 2025 సెప్టెంబరు 27: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శనివారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి సర్వభూపాల వాహనంపై శ్రీ బకాసుర వధ అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.
సర్వభూపాల వాహనం – యశోప్రాప్తి
సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీబీఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ మురళికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.












