SARVABHOOPALA GRACES DEVOTEES _ సర్వభూపాల వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి కటాక్షం
Tirupati, 22 Jun. 21: In his Nijaswarupam, Sri Prasanna Venkateswara Swamy flanked by Sridevi and Bhudevi on Sarvabhoopala Vahanam blessed devotees on Tuesday evening.
Due to Covid norms the Vahana Seva was held in Ekantam as a part of the ongoing annual Brahmotsavams in Appalayagunta on the fourth day evening.
Temple DyEO Smt Kasturi Bai, AEO Sri Prabhakar Reddy, Superintendent Sri Gopalakrishna Reddy and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సర్వభూపాల వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి కటాక్షం
తిరుపతి, 2021 జూన్ 22: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు సర్వభూపాల వాహనంపై దర్శమిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహనసేవలు నిర్వహించారు.
అనంతవిశ్వానికి సర్వభూపాలుడు అయిన శ్రీనివాసుడు కలియుగంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సర్వభూపాల వాహనాన్ని అధిరోహిస్తాడు. దీంతో పాటు పాలకులు భగవత్సేవాపరులు కావాలని సర్వభూపాల వాహనసేవ ద్వారా స్వామివారు దివ్యమైన సందేశాన్ని ఇస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు మరియు కంకణబట్టార్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ గోపాల కృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.