SARVABHOOPALA VAHANAM HELD _ సర్వభూపాల వాహనంపై రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకరణలో శ్రీవారు

Tirupati, 01 March 2025: Rukmini and Satyabhama sameta Sri Venugopala Swamy blessed devotees at Jubilee Hills on Saturday night on Sarvabhoopala Vahanam held as a part of the ongoing annual Brahmotsavam.
 
Temple AEO Sri Ramesh, temple priests and other officials were present in this program.
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సర్వభూపాల వాహనంపై రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకరణలో శ్రీవారు

హైద‌రాబాద్ / తిరుపతి, 2025 మార్చి 01: జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో శ‌నివారం రాత్రి సర్వభూపాల వాహనంపై రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి అలంకారంలో స్వామివారు ద‌ర్శ‌న‌మిచ్చారు.

భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.

సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ఏఈవో శ్రీ ర‌మేష్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు ఉన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది