SARVABHOOPALA VAHANAM PROCEEDS AMIDST PERFORMANCES BY VARIOUS ARTISTES _ సర్వభూపాల వాహనసేవలో సాంస్కృతిక శోభ

NADA NEERAJANAM PROGRAMS ENTHRALLS

TIRUMALA, 18 OCTOBER 2023: The devotional musical concert by Sri Pavan Kumar Charan under the title Annamaiah Sankeetana suma Malika on Nada Neerajanam enthralled devotees.

The performance by artists from different states in front of Sarvabhoopala Vahanam mesmerized the devotees. Narakasura Vadha Nritya Roopakam, Thimsa, Puradhara Sankeertana Nritya Roopakam, Gondu Dance, Dhol and Drum beats etc. enhanced the festive fervour along four mada streets.

While in Tirupati also, the programmes at Mahati, Ramachandra Pushkarini and Annamacharya Kalamandiram impressed the denizens.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

సర్వభూపాల వాహనసేవలో సాంస్కృతిక శోభ

తిరుమల, 2023 అక్టోబరు 18: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధ‌వారం రాత్రి సర్వభూపాల వాహనసేవలో వివిధ రాష్ట్రాల‌ నుంచి విచ్చేసిన కళాబృందాలు అద్భుత‌ ప్రదర్శనలిచ్చారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో 13 కళాబృందాలు, 329 మంది కళాకారులు పాల్గొని తమ సంగీత నృత్య ప్రదర్శనలతో భక్తులను పరవసింప చేశారు.

శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే కె.సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నరకాసుర వధ నృత్య రూపకాన్ని ప్రదర్శించి భక్తులను అలరించారు. వికారాబాద్ కు చెందిన ఎల్. అశోక్ బృందం తెలంగాణ జానపద కళారూపమైన థింసాను ప్రదర్శించి భక్తులను ఆకట్టుకున్నారు. తిరుపతి పట్టణానికి చెందిన ధనశ్రీ శ్రీనివాస్ బృందం పురందరదాసు సంకీర్తనా నృత్య రూపకంతో అలరించారు. విశాఖపట్నంకు చెందిన కె.సునీత బృందం కోలాటంతో అలరించారు. అనకాపల్లికి చెందిన డి.ధనలక్ష్మి బృందం కోలాట నృత్యాలతో అలరించారు. హైదరాబాద్ కు చెందిన ఎస్. గణేష్ బృందం గోండు నృత్యంతో కనువిందు చేశారు.

వికారాబాద్ కు చెందిన ఎల్. అశోక్ బృందం పులి వేషాలతో అలరించారు. తెలంగాణకు చెందిన లత బృందం వీరనాట్యాన్ని ప్రదర్శించి భక్తులను కనువిందు చేశారు. హైదరాబాదుకు చెందిన రాజి బృందం బతుకమ్మలతో ఆడిపాడారు. రాజమండ్రికి చెందిన పోసిరాణి బృందం డమరుక విన్యాసాలతో కనువిందు చేశారు. తిరుపతి పట్టణానికి చెందిన ఎ. చందన కోలాట నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. తిరుమల బాలాజీ నగర్ కు చెందిన డి. శ్రీనివాసులు బృందకోలాటాలతో అలరించారు. తిరుపతి పట్టణానికి చెందిన మురళీకృష్ణ బృందం శ్రీకృష్ణ లీలా విశేషాలను తెలిపే వేషధారణతో భక్తులను అలరించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.