SCHOLARS RECALL VENGAMAMBA WORKS _ వెంగమాంబ రచనలతో ఆధ్యాత్మిక చైతన్యం : శతావధాని శ్రీ ఆముదాల మురళి
TIRUPATI, 13 AUGUST 2024: Scholars remembered the life and great literary works penned by the saint poetess Matrusri Tarigonda Vengamamba on the occasion of her 207th Death Anniversary fete.
The event was held at Annamacharya Kalamandiram in Tirupati on Tuesday.
Versatile Telugu expert Dr Amudala Murali, All Projects Program Officer Sri Rajagopal, research scholar Rr Kesavulu, Dr Rajasekhar from SVU Oriental Research Institute recalled the various kritis penned by the saint poetess and her lifestyle where she stood as real example of women empowerment in those days itself fighting against all social odds that existed during that time.
TTD officials, locals, and students were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వెంగమాంబ రచనలతో ఆధ్యాత్మిక చైతన్యం : శతావధాని శ్రీ ఆముదాల మురళి
– ఘనంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి
తిరుపతి, 2024 ఆగష్టు 13: శ్రీవారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు ప్రదర్శించిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తన రచనలతో స్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేశారని శతావధాని శ్రీ ఆముదాల మురళి పేర్కొన్నారు. తిరుపతిలోని శ్వేత భవనంలో మాతృ శ్రీ తరిగొండ వెంగమాంబ 207వ వర్ధంతి ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తరిగొండ వెంగమాంబ సాహిత్యంపై సదస్సు జరిగింది. సదస్సుకు అధ్యక్షత వహించిన శ్రీ ఆముదాల మురళి ఉపన్యసిస్తూ, తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ద్వారా టీటీడీ వెంగమాంబ రచనలు వెలుగులోకి తీసుకొని వస్తున్నట్లు చెప్పారు. శ్రీ జూల కంటి బాలసుబ్రమణ్యం రచించిన తరిగొండ వెంగమాంబ జీవిత చరిత్రను పునర్ముద్రించి విద్యార్థులకు ఉచితంగా పంచుతున్నట్లు తెలిపారు. వెంగమాంబ రచించిన ద్విపద భాగవతంలోని చతుర్దస్కంథాన్ని త్వరలోనే ప్రచురించనున్నట్లు ఆయన వివరించారు.
శ్వేత ఇంచార్జ్ సంచాలకులు శ్రీ రాజగోపాల్ మాట్లాడుతూ, తరిగొండ వెంగమాంబ జీవితం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమన్నారు. నైతిక విలువలు పాటిస్తూ, ధార్మిక జీవనం గడపాలని విద్యార్థులకు సందేశం ఇచ్చారు. అనంతరం కేరళ చిత్రకారిణి శ్రీమతి కృష్ణప్రియ చిత్రించిన తరిగొండ వెంగమాంబ చిత్రపటాన్ని రాజగోపాల్ ఆవిష్కరించి, చిత్రకారిణిని సన్మానించారు.
ప్రముఖ పరిశోధకులు డాక్టర్ కేశవులు మాట్లాడుతూ, తరిగొండ వెంగమాంబ జీవితాన్ని, రచనను సమగ్రంగా పరిచయం చేశారు. ఎస్వీ విశ్వవిద్యాలయం ప్రాచ్య పరిశోధన సంస్థ అధ్యాపకులు డా.రాజశేఖర్ ఉపన్యసిస్తూ, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రచించిన తొమ్మిది యక్షగానాలను గురించి సమగ్రంగా వివరించారు
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.