SED, ARJITA SEVA AND ANGAPRADAKSHINAM ONLINE QUOTA TO BE RELEASED _ ఎస్ఇడి, అర్జితసేవ, అంగప్రదక్షిణం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్న టీటీడీ

TIRUMALA, 19 SEPTEMBER 2022: TTD will release the online quota of Rs.300 SED tickets for the month of November will be released on the TTD website on September 21 at 9am.

 

The Arjitha Seva tickets including Kalyanotsavam, Unjal Seva, Sahasra deepalankara seva for the month of November will be available for booking on September 21 at 3pm. These tickets will be issued on a first come first serve booking basis as per the availability of tickets.

 

The Srivari Arjitha seva Electronic dip registrations for the month of November will be available from September 21 onwards.

 

The Angapradakshinam tokens for the month of October will be released online on September 22 by 9am. However, the tokens for the Brahmotsavam dates i.e. from October 01-05 remain blocked.

 

Devotees are requested to make a note of this and book the tickets accordingly.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్ఇడి, అర్జితసేవ, అంగప్రదక్షిణం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్న టీటీడీ

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 19: నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.

అదేవిధంగా నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. టిక్కెట్ల లభ్యతను బట్టి ఈ టిక్కెట్లు మొద‌ట వ‌చ్చిన వారికి మొద‌ట కేటాయింపు ప్రాతిపదికన జారీ చేయబడతాయి.

నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.

అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి. అయితే బ్రహ్మోత్సవం తేదీలు అంటే అక్టోబర్ 1 నుండి 5వ తేదీ వ‌ర‌కు అంగప్రదక్షిణం టోకెన్లు కేటాయించ‌బ‌డ‌వు.

భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా టిక్కెట్లను బుక్ చేసుకోవాలని కోర‌డ‌మైన‌ది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.