SERVE FOOD AND MILK TO DEVOTEES IN QUEUE LINES-TTD CHAIRMAN _ క్యూ లైన్లలో భక్తులకు ఆహారం, పాలు అందించండి

TIRUMALA, 25 MARCH 2022:  In view of increased rush, TTD Chairman Sri YV Subba Reddy in Friday inspected Slot Sarvadarshan queues in Tirumala.

 

He interacted with the pilgrims on how much time it is taking for them to complete the darshan.

 

The Chairman was informed that it is taking less than one and a half hours if it is morning slot and nearly two hours in the evening slots.

 

Later he instructed the officials to ensure that food and milk is being supplied to the devotees in queue lines.

 

VGO Sri Bali Reddy was also present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

క్యూ లైన్లలో భక్తులకు ఆహారం, పాలు అందించండి
– అధికారులకు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆదేశం

తిరుమల 25 మార్చి 2022: శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లలో వెళ్ళే భక్తులకు ఆహారం, పాలు అందించాలని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.

తిరుమల లో భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో శుక్రవారం ఆయన స్లాట్ సర్వదర్శనం క్యూ లైన్లను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి దర్శనం కోసం ఎదురు చూస్తున్న సమయంలో తాగు నీరు, మరుగు దొడ్ల సదుపాయాలు సరిగా ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. క్యూ లో దర్శనానికి వెళుతున్న భక్తులతో మాట్లాడారు. క్యూ లైన్ల నిర్వహణ పరిశీలించారు. సర్వదర్శనం ఎంత సమయంలో అవుతోందని అధికారులను అడిగారు. ఉదయం అయితే గంటన్నర లోపు, సాయంత్రం 6 గంటల తరువాత వారికి రెండు గంటల్లో అవుతోందని అధికారులు తెలిపారు. క్యూ లైన్ లో భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజిఓ శ్రీ బాలిరెడ్డి ని చైర్మన్ ఆదేశించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది