SERVE WITH DEDICATION- ADDITIONAL EO _ భక్తి, నిష్టతో సేవ చేయండి : అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
Tirumala, 18 Mar. 22: TTD additional EO Sri AV Dharma Reddy on Friday said the Srivari Sevaks are blessed ones to process the cashew nuts for Srivari Prasadam and exhorted them to serve with devotion and commitment.
Processing the cashew nuts at the marketing godown, Tirupati, the TTD additional EO said nearly 4500-5000 kgs of cashew nuts are processed daily for Srivari laddu and other prasadams which were earlier purchased through tenders.
He said there was a lack of supply of quality processes cashew which handicapped production of Srivari Laddus and other Prasadam and hence TTD officials were sent to Kerala to survey the processing of raw cashew and a special hall was set up in the marketing godown and infrastructure was created for the functioning of Srivari Sevakulu and other TTD employees.
Later speaking to the media Sri Dharma Reddy said the arjita Seva tickets processing will be as before the Carona period.
He said arjita Seva tickets could be purchased online, lucky dip and through recommendation letters from April 1 onwards.
The Additional EO said, as now 130 Udayasthamana Seva tickets were booked.
CE Sri Nageswara Rao, GM (marketing) Sri Subramaniam, DyEO Sri Natesh Babu, were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
భక్తి, నిష్టతో సేవ చేయండి : అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుమల, 2022 మార్చి 18: శ్రీవారి ప్రసాదాల తయారీలో ముఖ్యమైన జీడిపప్పు గుండ్లను దబ్బలుగా మార్చే పనిని శ్రీవారి సేవకులు భక్తితో, నిష్టతో చేయాలని, ఇది స్వామివారు ఇచ్చిన అదృష్టమని టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి శ్రీవారి సేవకులకు సూచించారు.
తిరుపతిలోని మార్కెటింగ్ గోడౌన్‌లో శుక్రవారం ఉదయం ఈ కార్యక్రమాన్ని అదనపు ఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ, ఇతర ప్రసాదాల తయారీ కోసం రోజుకు 4 వేల 500 నుండి 5 వేల కిలోల జీడిపప్పు బద్దలు అవసరమవుతాయని చెప్పారు. గతంలో వీటిని టెండర్ ద్వారా కొనుగోలు చేసేవారమన్నారు.
కొంత కాలంగా టిటిడి నాణ్యతా ప్రమాణాలకు తగిన జీడిపప్పు బద్దలు లభించడం లేదని చెప్పారు. దీని వల్ల ప్రసాదాల తయారీకి ఇబ్బంది పడే పరిస్థితులు రాకూడదని కేరళకు అధికారుల బృందాన్ని పంపి జీడిపప్పు గుండ్లను బద్దలుగా మార్చే ప్రక్రియను తెలుసుకోవడం జరిగిందన్నారు. ఇందుకోసం మార్కెటింగ్ గోడౌన్‌లో ప్రత్యేక హాలు, శ్రీవారి సేవకులు, టిటిడి ఉద్యోగులకు అవసరమైన సదుపాయాలు కల్పించామని చెప్పారు.
అనంతరం శ్రీ ఎవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కరోనాకు ముందు ఆర్జిత సేవా టికెట్ల జారీ విధానం ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంటుందన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవలు ప్రారంభిస్తామని, ఇందుకోసం ఆన్‌లైన్, లక్కీడిప్, సిఫారసు లేఖలపై టికెట్లు పొందవచ్చన్నారు. ఇప్పటివరకు 130 ఉదయాస్తమాన సేవా టికెట్లు ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సిఇ శ్రీ నాగేశ్వరరావు, జియం మార్కెటింగ్( కొనుగోలు) శ్రీ సుబ్రమణ్యం, డెప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు, విజిలెన్స్ డిఇ శ్రీ రాధాకృష్ణా రెడ్డి పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.