SERVICE IN SRIVARI ABODE WAS A DIVINE OPPORTUNITY -DR. KS JAWAHAR REDDY _ స్వామివారి కొలువులో 19 నెలల పాటు సేవలందించడం పూర్వజన్మ సుకృతం : డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి
ADDL. EO TAKES CHARGE AS EO (FAC)
TIRUMALA, 08 MAY 2022: Dr KS Jawahar Reddy expressed that rendering service as Executive Officer in the world-famous Hindu Religious Organization of TTD was a divine opportunity.
Dr KS Jawahar Reddy handed over the full additional charge as EO to TTD Additional EO Sri AV Dharma Reddy at Tirumala temple on Sunday.
Earlier Dr KS Jawahar Reddy had darshan of Sri Venkateswara Swamy along with his family. Later he was rendered Vedaseervachanam at Ranganayakula Mandapam.
Sri Dharma Reddy has presented Theertha Prasadams, coffee table book and a Srivari photo to Sri Jawahar Reddy.
Speaking on the occasion Dr KS Jawahar Reddy expressed his immense pleasure for having rendered service as Executive Officer of TTD for 19 months in the divine abode.
He thanked SIRVA for giving the great opportunity. “With His blessings, I could able to complete many projects”, he maintained.
ADDL. EO AS EO FAC
Sri AV Dharma Reddy took charge as EO (FAC) later he made oath as Ex-officio Board Member, TTD inside sanctum sanctorum on Sunday in Timbale Srivari temple.
He was administered oath by TTD JEO (H &E) Smt Sada Bhargavi.
After darshan of Srivaru, the EO FAC Sri AV Dharma Reddy was rendered Vedaseervachanam at Ranganayakula Mandapam. He was later presented with Theertha Prasadams and photo of Srivaru by JEO (H & E).
Speaking on the occasion he said he has rendered service in the capacity of Additional EO of TTD for two and a half years and now Srivaru has blessed Him as EO FAC. He said he will continue to take forward the pilgrim welfare and other developmental activities.
CVSO Sri Narasimha Kishore, CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadeeshwar Reddy, ACVSO Sri Siva Kumar Reddy, DyEOs Sri Ramesh Babu, Smt Kasturi Bai, Sri Harindranath, Sri Bhaskar, Sri Venkataiah and other officers were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
స్వామివారి కొలువులో 19 నెలల పాటు సేవలందించడం పూర్వజన్మ సుకృతం : డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి
టిటిడి ఈఓ(ఎఫ్ఎసి)గా శ్రీ ఎవి.ధర్మారెడ్డి బాధ్యతలు స్వీకరణ
మే 08, తిరుమల, 2022: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి కొలువులో 19 నెలల పాటు భక్తులకు సేవలు అందించానని, దీన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డికి టిటిడి ఈవో(ఎఫ్ఎసి) బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డిని శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటంతో సన్మానించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ తన పదవీ కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, పలు కార్యక్రమాలు ఇంకా పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత బోర్డుతోపాటు రానున్న ఈఓ ఈ కార్యక్రమాలను పూర్తి చేస్తారని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. తన పదవీ కాలంలో సహకరించిన ధర్మకర్తల మండలికి, టిటిడి అధికారులకు, ఉద్యోగులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం టిటిడి ఈవో(ఎఫ్ఎసి) శ్రీ ఎవి.ధర్మారెడ్డి టిటిడి బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. జెఈఓ(ఆరోగ్యం, విద్య) శ్రీమతి సదా భార్గవి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని జెఈఓ అందించారు.
ఈ సందర్భంగా టిటిడి ఈవో(ఎఫ్ఎసి) శ్రీ ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల పాటు తాను అదనపు ఈఓగా బాధ్యతలు నిర్వహించానని, శ్రీవారి ఆశీస్సులతో ఈవో(ఎఫ్ఎసి) బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వహిస్తానని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సీవీఎస్వో శ్రీ నరసింహ కిషోర్, చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వర రావు, SE శ్రీ జగదీశ్వర రెడ్డి, అడిషనల్ సీవీఎస్వో శ్రీ శివ కుమార్ రెడ్డి డెప్యూటీ ఈవోలు శ్రీ రమేష్ బాబు, శ్రీ హరీంద్ర నాథ్ ,శ్రీమతి కస్తూరి బాయి, శ్రీ భాస్కర్, హెల్త్ ఆఫీసర్ Dr. శ్రీ దేవి, పేష్కార్లు శ్రీ శ్రీహరి, శ్రీ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.