SET HIGH GOALS – TTD JEO (H & E) EXHORTS STUDENTS _ విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలి

JEO PARTICIPATED IN 77th ANNIVERSARY OF SV ARTS COLLEGE

 

Tirupati, 08, August, 2022: TTD JEO (E&H) Smt Sada Bhargavi exhorted students to set high targets and plan their studies to achieve higher goals in their future career.

 

Participating as chief guest at the valedictory of the 77th anniversary celebrations of SV Arts College on Tuesday, in Tirupati the TTD JEO said the institution had turned out numerous celebrities and achievers in prominent sectors of society.

 

She exhorted the faculty and students of the premiere institute in Tirupati to strive to bag the NAAC A+ grade recognition.

 

She said education should be a fountain of knowledge but not a commercial venture and students set higher standards in their career and future goals.

 

She urged all the students of TTD educational institutions to pursue the path of Sanatana Hindu Dharma and women should be revered as espoused in Vedas and Upanishads. The society further enriched itself with education of women.

 

The JEO said TTD spared no efforts to provide all-round infrastructure for development of educational systems in its institutions.

 

The special invitee TTD board member Sri P Ashok Kumar, asked students to achieve stellar results and bring laurels to TTD Educational Institutions.

 

TTD DEO Sri Govindarajan, SV Arts college principal Dr Narayanamma, faculty members Smt.Usha,Dr Satyanarayana,Sri Prasada Rao,College students union Chairman Sri Aramudan, secretary Kumari Priyanka also were present.

 

Later TTD JEO presented certificates and momentos to meritorious students.

Thereafter students presented cultural programs to mark the festivities of the anniversary celebrations.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలి

– ఎస్వీ ఆర్ట్స్ కళాశాల 77వ వార్షికోత్సవ సభలో టీటీడీ
జెఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుపతి 9 ఆగస్టు 2022: విద్యార్థులు తమ భవిష్యత్తుపై ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని, ప్రణాళిక బద్దంగా చదువుకోవాలని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి పిలుపునిచ్చారు.

ఎస్వీ ఆర్ట్స్ కళాశాల 77వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం కళాశాలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జెఈవో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల అనేక రంగాల్లో ఎందరో ప్రముఖులను అందించిందని చెప్పారు.

అధ్యాపకులు, విద్యార్థులు కష్టపడి పరిశోధనలు పెంచి, కళాశాలకు న్యాక్ ఎ ప్లస్ గ్రేడ్ వచ్చేలా కృషి చేయాలని సూచించారు. విద్య వ్యాపారం కాకూడదని, మహాసముద్రం లాంటి జ్ఞాన సముపార్జనకు అదొక మార్గం మాత్రమేనన్నారు. ప్రతి ఒక్కరికి విద్యార్థి దశ ఎంతో ముఖ్యమని, ఈ దశ నుంచే ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలన్నారు. టీటీడీ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు సనాతన ధర్మ మార్గం అనుసరిస్తూ, సంస్థకు మంచిపేరు తేవాలని ఆమె కోరారు. వేదాలు, ఉపనిషత్తులు, సనాతన హిందూ ధర్మంలో చెప్పిన విధంగా, మహిళలకు గౌరవం ఇవ్వాలన్నారు. మహిళల విద్యతో సమాజం మరింత పురోగమిస్తుందని తెలిపారు. కళాశాల అభివృద్ధికి అవసరమైన వసతులు కల్పిస్తామని చెప్పారు.

ప్రత్యేక అతిథిగా హాజరైన టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు గురువులను గౌరవించాలన్నారు. దేశంలో నాణ్యమైన విద్య తగ్గుతోందని, టీటీడీ లాంటి మంచి విద్యాసంస్థలు తగ్గిపోవడమే ఇందుకు కారణమని ఆయన చెప్పారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో చదువుకుంటున్న విద్యార్థులందరు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన ఆశీర్వదించారు. టీటీడీ విద్యా సంస్థలకు దేశంలోనే గుర్తింపు తెచ్చేలా మంచి ఫలితాలు సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.
టీటీడీ డీఈవో శ్రీ గోవింద రాజన్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణమ్మ, అధ్యాపకులు శ్రీమతి ఉష, డాక్టర్ సత్యనారాయణ, శ్రీ ప్రసాద రావు, కళాశాల విద్యార్థి సంఘ చైర్మన్ శ్రీ అరముదన్, కార్యదర్శి కుమారి ప్రియాంక పాల్గొన్నారు.

అనంతరం జెఈవో శ్రీమతి సదా భార్గవి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెమెంటోలు బహూకరించారు.

అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది