SHANTI HOMAM BY TTD ON SEPTEMBER 23 IN TIRUMALA – EO _ సెప్టెంబరు 23న తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం- టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు
RITUAL TO WARD OFF EVIL EFFECTS
DEVOTEES EXPRESS SATISFACTION OVER ENHANCED TASTE IN LADDUS NOW
Tirupati, 22 September 2024: To ward off the ill effects and restore the sanctity of Laddu Prasadams along with the well being of Srivari devotees, TTD will perform Shanti Homam in Tirumala temple on September 23, said TTD EO Sri J. Syamala Rao.
Along with the Additional EO Sri Ch Venkaiah Chowdhary, addressing media persons in SPRH at Tirupati on Sunday evening, the EO said to overcome the misconceptions about the adulterated ghee used in Srivari Naivedyams which hurt the sentiments of millions and millions of Srivari devotees across the world, TTD mulled a Shanti Homam which will be observed in the Yagasala from 6am to 10am.
From August 15-17 we performed Pavitrotsavams which is an annual three day sin free festival prescribed in Agama Shastra. However , since the presence of adulterated ingredients were identified in Srivari Naivedyams, the Agama Salaha Mandali has decided to perform Shanti Homam.
This is a purification ritual which will be observed in Yagasala near Bangaru Bavi in the Tirumala temple.
Elaborating on the measures taken up by TTD over the improvement in the taste of laddus the EO said TTD has now changed the entire system of procurement of pure cow ghee.
Elaborating further on the reforms, the EO said, with these reforms now the taste of laddu prasadam has improved by many folds and the devotees express immense satisfaction over quality of Laddus, he maintained.
JEO Sri Veerabrahmam, Agama Advisors Sri Mohana Rangacharyulu, Sri Ramakrishna Deekshitulu were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సెప్టెంబరు 23న తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం
• శ్రీవారి లడ్డూ ప్రసాదాల నాణ్యతపై భక్తుల సంతృప్తి
• టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు
తిరుమల, 2024 సెప్టెంబరు 22: ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల శ్రేయస్సుతో పాటు లడ్డూ ప్రసాదాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 23న శాంతి హోమం నిర్వహించనున్నట్లు టిటిడి ఈవో శ్రీ జె.శ్యామలరావు చెప్పారు.
తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో టీటీడీ ఈవో, అదనపు శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ,
• ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా శ్రీవారి నైవేద్యంలో వాడే నెయ్యిలో కల్తీ ఉందని గుర్తించాము.
• సర్వపాప పరిహారార్థం, భక్తుల శ్రేయస్సును ఆకాంక్షిస్తూ సోమవారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తిరుమలలోని బంగారు భావిష్యంత ఉన్న యాగశాలలో శాంతి హోమం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించినట్లు తెలిపారు.
• ఇదివరకే ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు టీటీడీ మూడు రోజులపాటు పవిత్రోత్సవాలను ఆకమోక్తంగా నిర్వహించిందని, అయితే శ్రీవారి నైవేద్యంలో కల్తీ పదార్థాలు ఉన్నది గుర్తించినందున, అందుకు పరిహరణగా శాంతి హోమం నిర్వహించాలని ఆగమ సలహా మండలి నిర్ణయించినట్లు చెప్పారు.
• లడ్డూల రుచిని మెరుగుపరిచేందుకు టీటీడీ చేపట్టిన చర్యలను వివరిస్తూ, టీటీడీ ప్రస్తుతం ఆవు నెయ్యి కొనుగోలు విధానాన్ని పూర్తిగా మార్చివేసిందని, స్వచ్ఛమైన ఆవునేయిని ఎంతో పారదర్శకంగా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఈ సంస్కరణలతో ఇప్పుడు లడ్డూ ప్రసాదం రుచి అనేక రెట్లు మెరుగుపడిందని, భక్తులు కూడా ఎనలేని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఈవో వివరించారు.
ఈ సమావేశంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, శ్రీరామకృష్ణ దీక్షితులు తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.