SHIVA DHANURBHANGA ALANKARAM _ శివధనుర్భంగాలంకారంలో శ్రీరామచంద్రమూర్తి రాజసం
VONTIMITTA /TIRUMALA, 11 APRIL 2025: The sixth morning of ongoing annual Brahmotsavam at Vontimitta witnessed Sri Ramachandra Murty in Shiva Dhanurbhanga Alankaram blessing His devotees.
Kerala Drums, Chekka Bhajans, Kolatam teams enhanced the grandeur of Vahanam procession.
DyEO Sri Natesh Babu, Superintendent Sri Hanumantaiah, Temple Inspector Sri Naveen and others were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శివధనుర్భంగాలంకారంలో శ్రీరామచంద్రమూర్తి రాజసం
ఒంటిమిట్ట/ తిరుపతి 2025 ఏప్రిల్ 11: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 7.30 గంటలకు శివధనుర్భంగాలంకారంలో శ్రీ కోదండ రాములవారి రాజసం భక్తులకు కనువిందు చేసింది.
కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
స్వయంవరం సమయంలో శ్రీరాముడు శివుని విల్లును విరిచి సీతమ్మవారిని వివాహమాడే ఘట్టాన్ని గుర్తుచేసేది శివధనుర్భంగాలంకారం. సీతారాముల కల్యాణం రోజున ఉదయం ఈ అలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ నటేష్ బాబు, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.