SHOBHA YATRA HELD-ANKURARPANA PERFORMED _ శ్రీ వ‌కుళమాత‌ ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

TIRUPATI, 18 JUNE 2022: The Ankurarpana for the Mahasamprokshanam of Vakula Mata temple at Perur near Tirupati was held on Saturday evening.

 

Honourable Minister Sri P Ramachandra Reddy carried the Sare in a procession over his head in Shobha Yatra.

 

Later the Ritwiks performed Ankurarpana amidst chanting of Vedic mantras and held under the supervision of Agama Advisor Dr Vedantam Vishnu Bhattacharyulu.

 

The entire premises decked for the mega fete in a bright and colourful manner.

 

JEO Sri Veerabrahmam, Spl Gr DyEO Smt Varalakshmi, DyEO Sri Gunabhushan Reddy, Garden Deputy Director Sri Srinivasulu and others were present. 

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ వ‌కుళమాత‌ ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుపతి, 2022 జూన్ 18: తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద  పేరూరు బండపై నిర్మించిన శ్రీ వకుళమాత ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.

మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు జూన్ 23వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. జూన్ 23వ తేదీన‌ ఉద‌యం 7.30 నుండి 8.45 గంట‌ల వ‌ర‌కు విగ్ర‌హ‌ప్ర‌తిష్ట‌, మ‌హాసంప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు.

కాగా, శనివారం సాయంత్రం 6.30 గంట‌ల‌కు శోభాయాత్ర‌ వేడుకగా జరిగింది. రాత్రి 7.30 గంట‌ల‌కు పుణ్యాహ‌వ‌చ‌నం, ఆచార్య ఋత్విక్ వ‌ర‌ణం, మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ నిర్వ‌హించారు. టిటిడి వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు,
జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, డెప్యూటీ ఈవోలు శ్రీమతి వరలక్ష్మీ, శ్రీ గుణ‌భూష‌ణ్‌రెడ్డి, ఉద్యానవన విభాగం డెప్యూటి డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.