SHODASHADINA SUNDARAKANDA DIKSHA FROM MAY 3-18 _ తిరుమ‌ల‌లో ”షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష” కు శాస్త్రోక్తంగా అంకురార్ఫ‌ణ

Tirumala, 2 May 2021: TTD conducted the traditional Ankurarpanam fete at Dharmagiri Veda vijnan peetham on Sunday night for the shodashadina Sundara Kanda Diksha from tomorrow, May3-18.

The TTD is observing the 16-day long Diksha for well being of humanity seeking relief from Pandemic Corona at the Vasantha Mandapam in total adherence to Covid guidelines.

The fete will be conducted by 32 Vedic pundits and supervised by Principal Sri KSS Avadhani. While 16 of them will dairy observe Japam and Homam at Dharmagiri Veda vijnan peetham, another batch of 16 pundits will conduct parayanams of 68 sargas of Sundarakanda Diksha at the Vasantha Mandapam in Tirumala from May 3- 18.

The participant pundits have to observe rigid Vedic traditions of one meal a day, celibacy and daily japam etc.

TTD Additional EO Sri AV Dharma Reddy, teachers and Veda pundits of Dharmagiri were present.

TTD is already conducting Sundarakanda parayanams at the Nada Niranjanam platform daily in the morning between 07.00-8.00 am and the same is live telecast by SVBC to make devotees as partners in the spiritual campaign against Covid-19.

The 16-day Shodashadina Sundarakanda Diksha is another effort by TTD to intensify its spiritual campaign against Pandemic COVID-19. The Vedic pundits say that the Diksha is very auspicious and parayanams of each word in the Sundarakanda sargas carried significant spiritual impact on all evil forces afflicting humanity.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమ‌ల‌లో ”షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష” కు శాస్త్రోక్తంగా అంకురార్ఫ‌ణ

తిరుమల, 2021 మే 02: లోక క‌ల్యాణార్థం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో మే 3వ తేదీ నుండి టిటిడి నిర్వ‌హించ‌నున్న షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష కార్య‌క్ర‌మానికి ఆదివారం రాత్రి 7 గంట‌ల‌కు ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం ప్రార్థ‌న మందిరంలో శాస్త్రోక్తంగా అంకురార్ఫ‌ణ నిర్వ‌హించారు. ఇందులో భాగంగా విష్వ‌క్సేనారాధ‌న‌, పుణ్యాహ‌వ‌చ‌‌నం, రుత్విక్‌వ‌ర‌ణం, కంక‌ణ ధార‌ణ‌, అగ్నిప్ర‌తిష్ట‌, అంకురార్ఫ‌ణ నిర్వ‌హించారు.

తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని ఆధ్వ‌ర్యంలో 32 మంది ప్ర‌ముఖ పండితులు పాల్గొంటున్నారు. ఇందులో 16 మంది వేద పండితులు ధ‌‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠంలో జపం, హోమం నిర్వ‌హిస్తారు. వ‌సంత మండ‌పంలో మే 3 నుండి 18వ తేదీ వ‌ర‌కు 16 మంది పండితులు సుంద‌ర‌కాండ‌లోని 68 స‌ర్గల‌ను పారాయ‌ణం చేయ‌నున్నారు.

ఇందులో పాల్గొనే పండితులు ఒక పూట ఆహారం స్వీక‌రించి, రెండ‌వ పూట పాలు, పండ్లు స్వీక‌రిస్తూ, బ్ర‌హ్మ‌చ‌ర్యం పాటిస్తూ, నేల‌పై ప‌డుకుంటారు. ఆరోగ్య నియ‌మాలు పాటిస్తూ నిత్యం భ‌గ‌వ‌న్నామస్మ‌ర‌ణ చేస్తుంటారు.

ఈ కార్య‌క్ర‌మంలో అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి. ధర్మారెడ్డి దంప‌తులు, వేద పాఠ‌శాల అధ్యాప‌కులు, వేద పండితులు పాల్గొన్నారు.

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా మాన‌వ స‌మాజం కోవిడ్ – 19 వ్యాప్తి కార‌ణంగా ఇబ్బందుల‌లో ఉంది. కంటికి క‌నిపించ‌ని వైర‌స్ అనే శ‌త్రువుతో యుద్ధం చేస్తున్నాము. ఆ యుద్ధంలో విజ‌యం సాధించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాము. ఈ ప్ర‌య‌త్నం స‌ఫ‌లం కావాలంటే ప‌రిపూర్ణ‌మైన దైవాను గ్ర‌హం కావాలి. అందుకొసం టిటిడి తిరుమ‌ల‌లోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై ప్ర‌తి రోజు ఉద‌యం 7.00 నుండి 8.00 గంట‌ల వ‌ర‌కు సుంద‌ర‌కాండ పారాయ‌ణం చేస్తూ, ఇందులో భ‌క్తులంద‌రిని భాగ‌స్వాముల‌ను చేస్తు ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తున్నది. ఈ విజ‌యాన్ని మ‌రింత సులువు చేసే ప్ర‌య‌త్నంలో భాగంగా టిటిడి 16 రోజుల పాటు సుంద‌ర‌కాండ‌ను దీక్ష‌గా పారాయ‌ణం చేసే కార్య‌క్ర‌మాన్ని ఏర్పా‌టు చేసింది.

శ్రీ‌వారి స‌న్నిధిలోని వ‌సంత మండ‌పంలో షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష చాలా విశిష్ట‌మైనది. ” రాఘవస్య పద ద్వంద్వం దద్యాదమిత వైభవమ్‌ ” అనే వాక్యాన్ని అనుస‌రించి సీతాప‌తి అయిన శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి విజ‌యాన్ని ఇచ్చుగాక అనే అర్థం క‌లిగివుంటుంది. ఈ వాక్యం సంస్కృత బాష‌కు సంబంధించినది కావున ఇందులోని నియ‌మాల ప్ర‌కారం క‌ట‌ప‌యాగ సంఖ్య‌లు ప‌రిగ‌ణ‌లోనికి తీసుకుంటే ఒక్కొక్క అక్ష‌రానికి విలువ‌ను లెక్కించి, అందుకు అనుగుణంగా ఆయా రోజుల‌లో అన్ని స‌ర్గ‌లు పారాయ‌ణం చేయ‌నున్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.