SHROUTA YAGAMS TO CONCLUDE ON JULY 16 _ తిరుమలలో శాస్త్రోక్తంగా సర్వ పృష్టేష్టి యాగము
TIRUMALA, 15 JULY 2021: The week-long Shrouta Yagams mulled by TTD seeking divine intervention to ward off the ill effects of Corona Covid 19 Virus will conclude at Dharmagiri Veda Vignana Peetham in Tirumala on July 16.
These Yagams have been commenced with Mahendra Yagam on July 10 appeasing Lord Indra to bestow His blessings for the wellbeing of the humanity with good rains.
On July 11 and July 12 Pavitresthi and Mahapavitresthi were carried out respectively which signifies the waiving of sins committed either knowingly or unknowingly by the human beings in their day to day activities. Maha Pavitresthi was a unique Yagam where the blessings of about 20 deities were invoked.
On July 13 Aindravarunesthi Yagam was performed appeasing both Lord of Lords Indra and Rain God Varuna for prosperity and good rainfall. On July 14, Mitravindesthi Yagam was performed invoking the blessings of ten deities.
On July 15, Sarvaprusthesthi Yagam took place with religious fervour in Dharmagiri on Thursday. In this Yagam the blessings of all the prime deities of representing each season, each direction were invoked.
On July 16, the Shrouta Yagams will complete with Mrugaresthi Yagam whose importance is to get free from sins committed by entire humanity either knowingly or unknowingly.
Sri Kuppa Rajagopala Somayaji and Smt Kalpakamba Sompeethini served as Yajamani and Yajamana Pathni for this week-long Yagams which were held under the supervision of Dharmagiri Veda Vignana Peetham Principal Sri Kuppa Siva Subramanya Avadhani.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుమలలో శాస్త్రోక్తంగా సర్వ పృష్టేష్టి యాగము
తిరుమల, 2021 జూలై 15: లోక కల్యాణార్థం తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో టిటిడి నిర్వహిస్తున్న శ్రౌత యాగాల్లో భాగంగా ఆరవ రోజైన గురువారం ఉదయం సర్వ పృష్టేష్టి యాగము శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహేన్ద్రయాగ పూర్వక మృగారషట్కము అనే శ్రౌత యాగాలు జూలై 10వ తేదీ నుండి జరుగుతున్న విషయం విదితమే. ఈ యాగాలు జూలై 16వ తేదీన ముగియనున్నాయి.
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని ఆధ్వర్యంలో వేద విజ్ఞానపీఠంలో 9 మంది ప్రముఖ రుత్వికులు త్రేతాగ్నులు అనే హోమగుండాలలో అగ్నిని మదించి ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు యాగాలు (ఇష్టి) నిర్వహిస్తున్నారు. ఈ యాగాలు నిర్వహించడం వలన అగ్నితో మొదలై విష్ణువు వరకు సమస్త దేవతల అనుగ్రహం పొందుతారని, లోకంలోని సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉంటాయని, ఆరు ఋతువుల యందు సుభిక్షంగా ఉంటారని, సర్వ పాపాలు తొలగిపోతాయని వేద పండితులు తెలిపారు.
ఈ సందర్భంగా ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ గురువారం ఉదయం సర్వ పృష్టేష్టి యాగము జరిగినట్లు తెలిపారు. ఈ యాగముల వలన సమస్త దిక్కులు, అన్ని రుతువులు, అందరు దేవతల అనుగ్రహం కొరకు లోకక్షేమాన్ని కాంక్షిస్తూ ఈ యాగాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ఇందులో ప్రధాన హోమం ముందు ప్రధానంగా అగ్నిని మదించి, మోదుగ కొమ్మ, అవుపాలు, ఆవు పెరుగు అర్పించినట్లు వివరించారు.
జూలై 10వ తేదీ మహేంద్ర యాగం : ఇందులో ఆవు పాలు, ఆవు పెరుగుతో కలిపి ఇంద్రుడిని ఆరాధించడం వలన వర్షాలు సంవృద్ధిగా కురిసి పాడి పంటలతో లోకం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు.
జూలై 11వ తేదీ పవిత్రేష్టి యాగము : వేదం చెప్పే పండితులు ఎంత పవిత్రంగా ఉంటారో మానవులు అంతే పవిత్రంగా ఉండాలని, ఆ విధంగా ఉండేందుకు ఈ యాగము నిర్వహించినట్లు తెలిపారు. మనుషులలో తమోగుణం, రజోగుణం, పాపాలు తొలగిపోయి, నాలుగు వర్ణాలవారు వారివారి ధర్మాలను నెరవేర్చడానికి పవిత్రేష్టి యాగము నిర్వహించినట్లు చెప్పారు.
జూలై 12వ తేదీ మహా పవిత్రేష్టి యాగము : ఈ యాగములో 20 మంది దేవతాలు ఉంటారని, ఇందులో 10 మంది దేవతలకు పురడాశ్రమం అనే ద్రవ్యాన్ని ఇస్తారని, 10 మంది దేవతలకు ఆజ్యం అనే ద్రవ్యం సమర్పించినట్లు తెలిపారు. అగ్నిని అనేక రూపాలుగా పూజిస్తారని, మనం తీసుకునే ఆహారాన్ని విభజించి ఇంద్రియాలకు అందిస్తారన్నారు. మహా పవిత్రేష్టి యాగములో మాత్రమే ప్రత్యేకంగా 20 మంది దేవతలు ఉంటారన్నారు.
జూలై 13న ఐంద్రావరునేష్టి యాగము: ఇంద్రుడు, వరుణుడు కలిసిన యాగము వలన లోకంలోని మానవులు తెలిసీ, తెలియక అనేక విధములైన పాపాలు తొలగి పోవాలని ఈ యాగము నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తద్వారా రాక్షస స్వభావం, రాక్షస వాక్కు, రాక్షస శరీరం లేకుండా ఉంటాయని వివరించారు.
జూలై 14న మిత్రవిందేష్టి యాగములో 10 మంది దేవతలు కలిసి సమస్త లోకాలకు మంచి ఫలితాలను ఇస్తారన్నారు.
జూలై 16న మృగా రేష్టి యాగం వలన మానవులు తెలిసీ, తెలియక మనస్సు, వాక్కు వలన చేసిన ఎంతటి పాపామైన తొలగిపొయేందుకు ఈ యాగము నిర్వహించనున్నట్లు వివరించారు.
ఈ యాగానికి యజమానిగా శ్రీ కుప్పా రామగోపాల సోమయాజులు, యజమాని పత్ని శ్రీమతి కల్పకాంబ శోమపీఠిని వ్యవహరించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.