SIMHA VAHANA SEVA HELD _ సింహ వాహనంపై యోగనరసింహుడి అలంకారంలో శ్రీ మలయప్ప
COLOURFUL DISPLAY OF FINE ARTS FROM THE ARTISTS OF KARNATAKA
Tirumala, 20 September 2023: On the day-3 of the ongoing annual Brahmotsavams Sri Malayappa Swamy as Yoga Narasimha Swamy rode on Simha vahanam and blessed the devotees.
BOOKS RELEASED
TTD Chairman Sri Bhumana Karunakara Reddy along with the TTD EO Sri AV Dharma Reddy released three spiritual books which included Anubhava Pasuvaidya Chintamani in Telugu by Sriramulu Chowdary, Vedanta Desika-A multi-skilled Manager in English by Sri KS Mohan Kumar, Tarigonda Vengamamba Venkatachal ki Mahima by Sri IN Chandrasekhar Reddy.
CHILD TAGS TIED
During the Simha Vahana seva, the TTD Chairman and EO tied Child Tags to children, introduced by Tirumala Police to identify missing children cases if any, during the ongoing annual brahmotsavams. Tirumala ASP Sri Muniramaiah was also present.
The impressive procession of Lord was led by caparisoned elephant, bulls, horses with bhajan teams, Kolata and traditional drums beaters from Karnataka have mesmerized the pilgrims in glalleries. The unique artforms included Dasavaibhavam Rupakam representing the tradition of Bhagavadramanuja from Tamil Nadu State, Sriranga, Dolkunita Doluvaidya vinyasam, Kalpashri, Pooja Kunita, Gopika Rupa Kanthali, the dance traditions of Karnataka state have influenced the folk art dance form. Similarly, Dasanamanam, Goravara Kunita, Veeragase, Dasa Sankirtana Rupakam from Mysore and Kankipadu Kolata Bhajan from Vijayawada particularly impressed the devotees.
JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, DLO Sri Veeraju, CE Sri Nageswara Rao, were also present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సింహ వాహనంపై యోగనరసింహుడి అలంకారంలో శ్రీ మలయప్ప
తిరుమల, 2023 సెప్టెంబరు 20: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి సింహ వాహనంపై యోగనరసింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.
సింహ వాహనం – ధైర్యసిద్ధి
శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు.
చిన్నపిల్లలకు జియో ట్యాగ్
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే చిన్నపిల్లలలు తప్పిపోకుండా టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవో శ్రీమతి సదా భార్గవి, తిరుమల అదనపు ఎస్పీ శ్రీ మునిరామయ్యతో కలిసి జియో ట్యాగింగ్ కట్టడం ప్రారంభించారు.
సింహ వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం ఉదయం సింహ వాహనసేవలో మూడు ఆధ్యాత్మిక పుస్తకాలను టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఆవిష్కరించారు.
“అనుభవ పశువైద్య చింతామణి”. (తెలుగు) -శ్రీయజెళ్ళ శ్రీరాములు చౌదరి.
ప్రాచీన భారతదేశము వ్యవసాయమునకు, పశుపోషణకు ప్రఖ్యాతి గాంచినది. వేదాలలోనే పశువులకు, పశుపోషణకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చి గోమాతను దైవంగా భావించి పూజించాలని పేర్కొనబడింది. సనాతన హైందవ సంప్రదాయం ప్రకారం గో సంతతిలో ఒకటైన వృషభాన్ని ధర్మదేవతగా ఆరాధిస్తారు. వృషభజాతికి కూటస్థుడైన నందీశ్వరుడిని పరమశివుని వాహనంగా పూజిస్తారు. తిరుమల శ్రీవారి ఉత్సవాలు, ఊరేగింపులలో ఏనుగులు, గుర్రాలతో పాటు వృషభాలు కూడా పాల్గొనడం ఆనవాయతీ. వ్యవసాయాభివృద్ధికి కూడా పశువులే అత్యవసరం, వాటి నుండి వచ్చే ఎరువుద్వారా పంటపొలాలు వృద్ధి చెందుతాయి. గోవిందునికి గోఆధారిత నివేదనలను సమర్పిస్తూ గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న తి.తి.దేవస్థానములు పశుసంపదను ఆరోగ్యవంతంగా చూసుకోవాలంటే పశువైద్య సహకారమెంతైనా అవసరం అని భావించింది. అందుకే శ్రీ యేజళ్ళ శ్రీరాములు చౌదరిగారు తమ పాతిక సంవత్సరముల అనుభవాన్ని, అమూల్య విజ్ఞానాన్ని జోడించి వ్రాసిన, ఆంధ్రదేశమంతటా విస్తృత ప్రచారాన్ని పొందిన ‘అనుభవ పశువైద్యచింతామణి’ అనే ఈ గ్రంథాన్ని పశుసంరక్షణ, పశువైద్యం కొరకు తి.తి.దేవస్థానములు ముద్రిస్తున్నది.
“వేదాంతదేశిక – ఎ మల్టీస్కిల్డ్ మేనేజర్”(ఇంగ్లీష్) – శ్రీ కె.ఎస్. మోహన్ కుమార్
శ్రీవైష్ణవ సంప్రదాయంలో రామానుజుల తదనంతర కాలంలో వచ్చిన మహనీయులు శ్రీవేదాంతదేశికులు. వేదాంతదేశికులు శ్రీవైష్ణవమత ప్రబోధంతోపాటు అనేకానేక రంగాలలో నైపుణ్యాన్ని గడించినవారు. శతాధిక గ్రంథాలను రచనచేశారు. వీరు గొప్ప దార్శనికులేకాక, బహుముఖప్రజ్ఞాశీలురు, ఇరవైఏడేళ్ళ వయస్సులోనే “సర్వతంత్ర స్వతంత్ర”, “కవితార్కిక కేసరి” బిరుదులను పొందినవారు. ఒక వ్యక్తి కేవలం ఒక రంగానికే అంకితం కాకుండా అనేక రంగాలలో పరిజ్ఞానాన్నిపొంది అందులో నైపుణ్యాన్ని సాధిస్తే వారిని “బహుముఖప్రజ్ఞాశీలి”, “మల్టీల్ మేనేజర్” అంటారు. వేదాంతదేశికులు తమ జీవితంలో కేవలం ధర్మప్రబోధమే కాకుండా రచనా వ్యాసంగం, సామాజికసేవ మున్నగు రంగాలలో ఎలా తమ బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారన్న విషయాన్ని శ్రీ కె.ఎస్.మోహన్ కుమార్ గారు ఆధునిక సమాజాన్నిదృష్టిలో పెట్టుకొని వ్రాసిన పుస్తకమే ఈ “వేదాంతదేశిక- ఎ మల్టీస్కిల్డ్ మేనేజర్”. శ్రీ కె.ఎస్ మోహన్ కుమార్ గారు మేనేజ్మెంట్ దృష్ట్యా వ్రాసిన “రామానుజ అండ్ హిజ్ మేనేజ్మెంట్” అనే గ్రంథాన్ని ఇదివరలో తి.తి.దే. ప్రచురించింది.
తరిగొండ వెంగమాంబ వేంకటాచల్ కీ మహిమా” (హిందీ)
– ప్రా॥ఐ.ఎన్. చంద్రశేఖర్ రెడ్డి
కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిని మించిన దైవం కానీ వేంకటాచల క్షేత్రాన్ని మించిన క్షేత్రం కానీ, వేంకటేశ్వరస్వామి నామానికి మించిన మంత్రం కానీ లేవని బ్రహ్మాండాది పురాణాలు చెబుతున్నాయి. అటువంటి స్వామివారి వేంకటాచల ఆగమనాన్ని, మహాత్మ్యాన్ని గురించి బ్రహ్మ, బ్రహ్మాండ, భవిష్య, పార్మ పురాణాది 12 పురాణాలు తెలియజేస్తున్నాయి. సంస్కృతంలో 12 పురాణాలలో శ్లోకరూపంలో ఉన్న వేంకటాచల మాహాత్మ్యాన్ని తేటతెలుగులో అందరికీ అర్థమయ్యేలా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ “వెంకటాచల మాహాత్మ్యం” పేరుతో పద్యకావ్యంగా రచించారు. తెలుగులో నిత్యపారాయణ గ్రంథంగా భావించబడుతున్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబగారి “వేంకటాచల మాహాత్మ్యాన్ని” సార్వజనీకానికి అర్ధమ్యేలా హిందీ వచనంలోనికి “మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వేంకటాచల్ కీ మహిమా” అనే పేరుతో అనువదించారు. ప్రముఖ రచయిత, అనువాదకులు ఆచార్య బి.ఎన్ చంద్రశేఖర రెడ్డిగారు. ఈ గ్రంథాన్ని తి.తి. దేవస్థానములు స్వీయ ప్రచురణగా ముద్రించి భక్తలోకానికి అందిస్తున్నది.
రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు అభయమిస్తారు.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, డిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.