SINCILATING CULTURAL PROGRAMS BY TTD _ శ్రీ పద్మావతి అమ్మవారికి సాంస్కృతిక శోభ
Tirupati, 24 Nov. 19: On the day two of Karthika brahmotsavams of Sri Padmavati Ammaari Temple at Tiruchanoor, the cultural programs organized by the TTDs HDPP, Annamacharya Project, Dasa Sahitya Project at the Asthana mandapam held the devotees captivated throughout the day.
At the Asthana Mandapam of Tiruchanoor, the team of Sri B Kesanna of Tirupati rendered Mangaladhwani and Sri Sri Sri. Swaroopananda swamiji gave religious discourse on necessity of practice of Veda dharma in society.
Acharya Chakravarty Ranganathan of Tirupati presented a discourse followed by Bhakti sangeet by team of Smt Priya Mohan of Hyderabad at the Astana mandapam.
There after Sri Ramulu Bhagavatar of Tirupati presented Harikatha Parayanam. Dhulipala sisters of Tirupati excited the citizens of the temple city with Annamaiah vinnapalu and the troupe of Smt Janati of Visakhapatnam presented sankeertans during unjal seva in the evening.
Similarly, at Mahati auditorium, Dr Jayaprada Ramamurthy team of Hyderabad presented Venu ganam. Bhakti sangeet at Annamacharya Kala Mandiram by Smt Madhavi Lata of Hosuru mused the audience. Later on Smt Padmasri team of Hyderabad presented Bhakti sangeet at Ramachandra Pushkarani.
Lastly the team of Smt V Pratyusha from Tirupati enthralled the audience at the Shilparamam in Tiruchanoor Road with Bhakti sangeet program.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారికి సాంస్కృతిక శోభ
తిరుపతి, 2019 నవంబరు 24: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తిరుచానూరులోని ఆస్థానమండపంలో ఉదయం 5.30 నుండి 6.00 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ బి.కేశన్న బృందం మంగళధ్వని, ఉదయం 6.00 నుండి
7.30 గంటల వరకు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి సమాజానికి వేదధర్మ అవశ్యకతపై అనుగ్రహభాషణం చేశారు.
ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు తిరుపతికి చెందిన ఆచార్య చక్రవర్తి రంగనాథన్ ధార్మికోపన్యాసం చేశారు. ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు హైదరాబాదుకు చెందిన శ్రీమతి ప్రియామోహన్ బృందం వారిచే భక్తి సంగీత కార్యక్రమం జరిగింది.
అనంతరం మధ్యాహ్నం 3.00 నుండి 4.30 గంటల వరకు తిరుపతికి
చెందిన శ్రీ రాముడు భాగవతార్ హరికథ పారాయణం చేశారు. కాగా సాయంత్రం 4.30 నుండి 6.00 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ ధూళిపాళ సిస్టర్స్ అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.00 గంటల వరకు విశాఖపట్నంకు చెందిన శ్రీమతి బినతి బృందం ఊంజల్ సేవలో
సంకీర్తనలను గానం చేయనున్నారు.
అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన డా.జయప్రద రామమూర్తి వేణుగానం, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు హోసురుకు చెందిన మాధవీలత బృందంచే భక్తి సంగీతం, రామచంద్ర పుష్కరిణి వద్ద హైదరాబాద్‌కు చెందిన పద్మశ్రీ బృందంచే సంగీత కార్యక్రమాలు
నిర్వహించన్నున్నారు. తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం
6.30 నుండి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన వి.ప్రత్యూష బృందం భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.