SITA RAMA KALYANAM HELD IN KRT _ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

Tirupati, 07 April 2025: The celestial Sita Rama Kalyanam took place in a grand manner at Sri Kodandarama temple in Tirupati on Monday evening.

Hundreds of devotees gathered to witness the divine marriage with utmost devotion.

Rituals like Punyahavachanam, Sadyo Ankurarpanam, Raksha Bandhanam, Agni Pratista, Kanya Danam, Maha Sankalpam, Mangalya Puja and Purnahuti followed by Akshataroahanam and samarpana of Talambralu performed.

DyEO Smt Nagaratna and others were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

 తిరుపతి, 2025 ఏప్రిల్ 07: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సోమ‌వారం రాత్రి శ్రీ‌ సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది.

ముందుగా అర్చకులు పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, విశేషారాధన చేశారు. ఆ తరువాత రక్షాబంధన, అగ్నిప్రతిష్ఠ, మధుపర్కం, కన్యాదానం, మహాసంకల్పం, స్వామి, అమ్మవారికి ప్రవరలు, మాంగళ్యపూజ చేపట్టారు. అనంతరం మాంగళ్యధారణ, ఉక్తహోమాలు, పూర్ణాహుతి, నివేదన, అక్షతారోహణం, ముత్యాల త‌లంబ్రాల స‌మ‌ర్ప‌ణ‌, విశేష నివేద‌న‌, మాల‌మార్పిడి, అక్ష‌తారోహ‌ణ‌, హార‌తి, చ‌తుర్వేద పారాయ‌ణం, య‌జ‌మానికి వేద ఆశీర్వాదం, హారతి ఇచ్చారు. కల్యాణం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను ఆలయ ప్రాంగ‌ణంలో ఊరేగింపు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ ర‌వి, సూపరింటెండెంట్‌ శ్రీ మునిశంక‌ర్‌, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్‌, విశేష సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.