SIVA PARVATI KALYANAM PERFORMED _ వైభవంగా శివపార్వతుల కల్యాణం
TIRUPATI, 27 FEBRUARY 2025: The celestial Siva Parvati Kalyanam was held with utmost spiritual fervour in Sri Kapileswara Swamy temple on Thursday evening.
On the penultimate day of the annual ten-day Brahmotsavam, the devotees witnessed the grand divine wedding ceremony of the finely decked utsava deities of Sri Kapileswara Swamy and Sri Kamakshi Devi.
Devotees thronged to witness the ceremony held in a spectacular manner.
Meanwhile, on February 28, Trishula Snanam will be observed.
Earlier between 6:30am and 8:30am Sri Nataraja Swamy will bless devotees on Suryaprabha Vahanam followed by Trishula Snanam.
DyEO Sri Devendra Babu and other temple staff, devotees were present in celestial Siva Parvati Kalyanam.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవంగా శివపార్వతుల కల్యాణం
– ఫిబ్రవరి 28న త్రిశూలస్నానం
తిరుపతి, 2025 ఫిబ్రవరి 27: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు శ్రీ మణివాసన్ గురుకుల్ ఆధ్వర్యంలో అర్చకులు శాస్త్రోక్తంగా పార్వతీ పరమేశ్వరుల కల్యాణం జరిపించారు. ఆనంతరం తిరుచ్చిపై స్వామివారు పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
ఫిబ్రంవరి 28న త్రిశూలస్నానం :
బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శుక్రవారం త్రిశూలస్నానం వైభవంగా జరుగనుంది. ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు శ్రీ నటరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై దర్శనమివ్వనున్నారు. ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు త్రిశూలస్నానం ఘట్టం శాస్త్రోక్తంగా జరుగనుంది.
సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల మధ్య ధ్వజావరోహణం నిర్వహించనున్నారు. ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా రాత్రి 8 నుండి 10 గంటల వరకు రావణాసుర వాహనసేవ జరుగనుంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది