SNAPANA TIRUMANJANAM HELD _ వైభవంగా శ్రీవారికి స్నపనతిరుమంజనం _ వైభవంగా శ్రీవారికి స్నపన తిరుమంజనం
Tirumala, 31 March 2026: As a part of the ongoing annual Vasantotsavams in Tirumala, on the second day evening on Tuesday
Sri Malayappa Swamy and His two Consorts, Sridevi and Bhudevi, were rendered Snapana Tirumanjanam between 2 pm and 4 pm.
HH Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Chinna Jeeyar Swamy, EO Sri Muddada Ravi Chandra, Additional EO Sri Ch.Venkaiah Chowdary, Temple Dy EO Sri Lokanatham and other officers participated in this religious event.
Cancellation of Pournami Garudaseva on April 01
TTD has cancelled the Purnami Garudaseva on April 01 at Tirumala in connection with annual Vasanthotsavams.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవంగా శ్రీవారికి స్నపన తిరుమంజనం
ఏప్రిల్ 1న పౌర్ణమి గరుడసేవ రద్దు
తిరుమల, 2026 మార్చి 31: తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలలో భాగంగా రెండవ రోజైన మంగళవారం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది.
ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లు సాయంత్రం అక్కడినుండి బయల్దేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 1న పౌర్ణమి గరుడసేవ రద్దు
శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీన పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.
శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు జరుగుతున్న కారణంగా పౌర్ణమి గరుడసేవ రద్దయింది. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.









