SOCIAL MEDIA VIDEO THAT A MAN CONSUMED IN TIRUMALA IS UNTRUE _ ”తిరుమలలో మద్యం సేవించిన వ్యక్తి” అనే ప్రచారం సత్యదూరం
Tirumala, 09 June 2025: It has come to the notice of TTD that a video circulating on social media platforms recently shows a man consuming alcohol and is spreading rumors, describing it as having taken place in Tirumala. is completely untrue.
The alleged incident took place at the beginning of Alipiri, i.e. before reaching the check post and that area does not fall within the Tirumala.
However, some individuals are involved in spreading false propaganda that there has been corruption in Tirumala with all their mis propaganda.
In this context, TTD appeals to devotees not to believe in such false propaganda or else that legal action will be taken against those who spread lies that damage the sanctity of Tirumala.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
”తిరుమలలో మద్యం సేవించిన వ్యక్తి” అనే ప్రచారం సత్యదూరం
తిరుమల, 2025 జూన్ 09: ఇటీవల సోషల్ మీడియా వేదికలలో ప్రచారం అవుతున్న ఒక వీడియోలో మద్యం సేవిస్తున్న వ్యక్తి దృశ్యాలను తిరుమలలో జరిగినదిగా వర్ణిస్తూ పుకార్లు వ్యాప్తి చేస్తున్నట్లుగా టీటీడీ దృష్టికి వచ్చింది. ఈ ప్రచారాన్ని టీటీడీ పూర్తిగా ఖండిస్తోంది.
సంబంధిత ఘటన అలిపిరి ప్రారంభంలో అంటే తనిఖీ కేంద్రానికి వచ్చే ముందు ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ ప్రాంతం తిరుమల పరిధిలోకి రాదు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు ప్రచార యావతో తిరుమలలో అపచారం జరిగిందంటూ ప్రచారం చేయడం మహాపాపం.
ఈ నేపథ్యంలో భక్తులు తప్పుడు ప్రచారాలను నమ్మకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుమల పవిత్రతను దెబ్బతీసే అసత్యాలను ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడమైనది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.