SOLAR ECLIPSE ON DEC 26 _ డిసెంబరు 26న సూర్యగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయ తలుపులు మూత
TTD CANCELS VIP BREAK DARSHAN INCLUDING PROTOCOL ON THAT DAY
ANNAPRASADAM ACTIVITY COMMENCES AFTER 2.30 ON DEC 26
Tirumala, 23 Dec. 19: Tirumala temple to remain closed for nearly 13 hours on December 26 following Sampoorna Surya Grahanam.
As the solar eclipse commences at 8.08 am and concludes by 11:16 am, as a tradition, the temple doors will be closed on December 25 by 11 pm itself and will be opened at 12noon on December 26.
After the suddhi and other rituals, the darshan will commence to the pilgrims only after 2 pm onwards. TTD has cancelled VIP Break darshan including Protocol on that day in view of common pilgrims.
Even the serving of annaprasadam in MTVAC, food courts, compartments will also be stalled from 11pm of December 25 till 2:30pm of December 26.
The devotees are requested to make note of these changes and plan their pilgrimage accordingly.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
డిసెంబరు 26న సూర్యగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయ తలుపులు మూత
బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల, 2019 డిసెంబరు 23: సూర్యగ్రహణం కారణంగా డిసెంబరు 25, 26వ తేదీల్లో రెండు రోజుల్లో కలిపి 13 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నారు. సామాన్య భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని డిసెంబరు 26న గురువారం నాడు విఐపి బ్రేక్ దర్శనాలు(ప్రోటోకాల్ దర్శనాలు కూడా) రద్దు చేయడమైనది.
డిసెంబరు 26న గురువారం నాడు ఉదయం 8.08 గంటల నుండి ఉదయం 11.16 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆరు గంటల ముందుగా అనగా డిసెంబరు 25న బుధవారం రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయం తలుపులు మూస్తారు. డిసెంబరు 26న గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం తలుపులు తెరుస్తారు. ఆలయశుద్ధి అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.
అన్నప్రసాద భవనం మూత
గ్రహణం కారణంగా డిసెంబరు 25వ తేదీ రాత్రి 11 గంటల నుండి డిసెంబరు 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ మూసివేయడం జరుగుతుంది. వంటశాల శుద్ధి అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల నుండి అన్నప్రసాద వితరణ ప్రారంభమవుతుంది. భక్తులు ఈ విషయాలను గమనించి తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని కోరడమైనది.
ఆర్జిత సేవలు రద్దు
సూర్యగ్రహణం కారణంగా డిసెంబరు 26న తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.