SOMA SKANDA MURTHY ON ASWA VAHANAM _ అశ్వ వాహనంపై సోమస్కందమూర్తి
Tirupati, 28 Feb. 22: As part of the ongoing annual brahmotsavam at Sri Kapileswara Swamy temple in Tirupati, Sri Somaskanda Murty appeared on Aswa vahanam on Monday evening.
Due to Covid restrictions, this vahana seva was observed in Ekantam.
DyEO Sri Subramanyam, AEO Sri Satre Naik, Superintendent Sri Bhupati, Temple Inspector Sri Reddy Sekhar were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అశ్వ వాహనంపై సోమస్కందమూర్తి
తిరుపతి, 2022 ఫిబ్రవరి 28: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం రాత్రి శ్రీ సోమస్కంధమూర్తి అశ్వ వాహనంపై అనుగ్రహించారు. కోవిడ్ -19 నిబంధనల మేరకు వాహన సేవ ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
ఏడో రోజు రాత్రి స్వామివారు అశ్వ వాహనం అధిష్టించి తనవేగశక్తి, బలశక్తి నిరూపిస్తుంటారు. ఇంద్రునికి ఏనుగుతోపాటు గుర్రం కూడా వాహనంగా ఉంది. ఆధ్యాత్మికంగా పరమాత్మే అశ్వం. ఆయనే మనహృదయంలోఉండి, ఇంద్రియాల్ని నియంత్రిస్తున్నాడు.
వాహనసేవలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డిశేఖర్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.