SOMA SKANDA ROARS ON SIMHA VAHANA _ సింహ వాహనంపై శ్రీ సోమస్కంద మూర్తి
TIRUPATI, 10 FEBRUARY 2026: Sri Somaskandamurty took out a majestic ride on Simha Vahanam as a part of the ongoing annual brahmotsavams at Sri Kapileswara Swamy temple in Tirupati on Tuesday evening.
JEO Sri Veerabrahmam, Superintendent Sri Chandrasekhar, and other staff, devotees participated.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
సింహ వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి
తిరుపతి, 2026 ఫిబ్రవరి 10: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన మంగళవారం రాత్రి శ్రీ సోమస్కందమూర్తి సింహ వాహనంపై అభయమిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది.
మృగరాజు సింహం. దేవతల్లో అత్యంత ఉత్కృష్టుడు పరమేశ్వరుడు. భక్తుల హృదయం గుహ వంటిది. ఆ గుహలో సింహం వంటి ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంచుకుంటే జీవుడు ఏ భయాన్ని పొందడు. మృగరాజు వంటి శివపరమాత్మ కొలువై అభయమిచ్చి జీవనాన్ని పాలిస్తుంటే, అరిషడ్వర్గాలనే క్షుద్రమృగాల భయం ఉండదు.
వాహనసేవలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సూపరింటెండెంట్ శ్రీ చంద్ర శేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.






