SOMASKANDA ON SIMHA _ సింహ‌ వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి

Tirupati, 24 Feb. 22: Sri Somaskanda Murty seated majestically on Simha Vahanam on Thursday evening as part of the ongoing annual Brahmotsavam in Srinivasa Mangapuram.

 

Temple DyEO Sri Subramanyam and others present in this Ekanta Brahmotsavam.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

సింహ‌ వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి

తిరుపతి, 2022 ఫిబ్ర‌వ‌రి 24: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన గురువారం రాత్రి శ్రీ సోమస్కందమూర్తి సింహ వాహనంపై దర్శనమిచ్చారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు వాహ‌న సేవ‌లు ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

సింహం మృగరాజు. దేవతల్లో అత్యంత ఉత్కృష్టుడు పరమేశ్వరుడు. భక్తుల హృదయం గుహ వంటిది. ఆ గుహలో సింహం వంటి ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంచుకుంటే జీవుడిని ఎలాంటి భయం ఆవహించదు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.