SOWBHAGYAM MATERIAL REACHES TTD TEMPLES _ టిటిడి ఆలయాలకు చేరిన సౌభాగ్యం మెటీరియల్
Tirupati, 04 August 2025: On the occasion of Varalakshmi Vratham on August 08, TTD and HDPP will jointly organize a Sowbhagyam program in 51 temples of TTD located in both the Telugu states of AP and Telangana.
The offerings of bangles, turmeric threads, Kankanams, vermilion, sacred rice and devotional books have reached the said 51 temples.
All these sacred items including, 8 lakh bangles, 1.40 lakh each turmeric threads, Kankanams, vermilion packets, and Ammavari Lakshmi Astottara Sata Namavali Pustaka Prasadams were donated to TTD by an anonymous devotee.
The authorities of the respective temples are making arrangements to distribute these sacred items among women devotees on the occasion of Varalakshmi Vratham in the said temples on August 08.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టిటిడి ఆలయాలకు చేరిన సౌభాగ్యం మెటీరియల్
తిరుపతి, 2025 ఆగస్టు 04: ఆగష్టు 08వ తేదీన వరలక్ష్మీ వ్రతం సందర్భంగా టీటీడీ, హిందూ ధర్మప్రచార పరిషత్ సంయుక్తంగా టీటీడీకి చెందిన 51 ఆలయాలలో సౌభాగ్యం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సౌభాగ్యవతులకు గాజులు, పసుపు, కుంకుమ, అక్షింతలు, పుస్తక ప్రసాదాలు సదరు 51 ఆలయాలకు చేరుకున్నాయి.
వరలక్ష్మీ వ్రతం రోజున టీటీడీ ఆలయాలలో సౌభాగ్యం పేరుతో మహిళలకు గాజులు, పసుపు, కుంకుమ, అక్షింతలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 51 ఆలయాలలో సౌభాగ్యవతులకు గాజులు, శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, పసుపు దారాలు, శ్రీ పద్మావతీ అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర శత నామావళి పుస్తక ప్రసాదాలను అందించనున్నారు.
ఈ సందర్భంగా సుమంగళి ద్రవ్యాలను సౌభాగ్యవతులకు పంపిణీ చేసేందుకు ఓ అజ్ఞాత భక్తుడు విరాళంగా అందించిన 8 లక్షల గాజులు, 1.40 లక్షల కంకణాలు, 1.40 లక్షల పసుపు దారాలు, 1.40 లక్షల అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు, అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర శత నామావళి పుస్తక ప్రసాదాలను సదరు ఆలయాలకు చేరుకున్నాయి.
సదరు ఆలయాల్లో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తిరుపతి నుండి పంపిన సౌభాగ్యం మెటీరియల్ ను సౌభాగ్యవతులకు అందించేందుకు ఆయా ఆలయాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.




