SPECIAL ABHISHEKAM HELD _ తిరుమ‌ల శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి ఘ‌నంగా అభిషేకం

SPECIAL ABHISHEKAM HELD

TIRUMALA, 12 DECEMBER 2021: Special Abhishekam to Sri Bedi Anjaneya was held in Tirumala on Sunday in connection with the last Sunday of Karthika Masam.

Deputy EO Parakamani Sri Venkataiah, VGO Sri Bali Reddy and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమ‌ల శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి ఘ‌నంగా అభిషేకం

తిరుమ‌ల‌, 2021 డిసెంబర్ 12: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి కార్తీక మాసం చివరి ఆదివారం సంద‌ర్బంగా ప్రత్యేక అభిషేకం ఘ‌నంగా నిర్వ‌హించారు. ప‌విత్ర కార్తీక మాసం చివ‌రి ఆదివారం స్వామివారికి తిరుమంజ‌నం నిర్వ‌హించ‌డం ఆనవాయితీగా వస్తోంది.

ఈ సంద‌ర్భంగా స్వామివారికి ఉద‌యం పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రి నీళ్ళు, గంధంతో తిరుమంజ‌నం నిర్వ‌హించి, సింధూరంతో విశేష అలంక‌ర‌ణ చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో శ్రీ వెంక‌ట‌య్య‌, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.