SPECIAL ABHISHEKAM HELD TO SRI LAKSHMI NARASIMHA SWAMY TEMPLE _ మొదటి ఘాట్‌లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి వైభవంగా ప్రత్యేక అభిషేకం

Tirumala, 19 November 2025: Special Abhishekam was performed on Wednesday in Sri Lakshmi Narasimha Swamy temple located along the Alipiri footpath on the First Ghat Road(Down Ghat) in Tirumala. 

As part of the traditional practice, a special Abhishekam is conducted every year in this temple in the advent of the auspicious Swati star – the birth star of the deity during the sacred Karthika month.

On this occasion, the presiding deity of Sri Lakshmi Narasimha Swamy was ceremoniously offered Abhishekam with milk, curd, honey, sandal paste, and turmeric.

The TTD Additional EO Sri C.Ch. Venkaiah Chowdary, Potu Peishkar Sri Muniratnam, other TTD officials and temple priests took part in the programme.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

మొదటి ఘాట్‌లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి వైభవంగా ప్రత్యేక అభిషేకం

తిరుమల, 2025 నవంబర్ 19: తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని అలిపిరి నడకమార్గం లో వెలసివున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి బుధవారం ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. 

పవిత్ర కార్తీక మాసంలో స్వాతి తిరు నక్షత్రం సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో మూలమూర్తికి ఉదయం పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపులతో విశేషంగా అభిషేకం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి పాల్గొని భక్తులకు స్వయంగా ప్రసాదాలు వితరణ చేశారు. అనంతరం అడిషనల్ ఈవోను శ్రీవారి ఆలయ పోటు పేష్కార్ శ్రీ మునిరత్నం సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఇతర టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.