SPECIAL FESTIVALS AT SRI GOVINDARAJA SWAMY TEMPLE IN APRIL _ ఏప్రిల్‌లో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, April 04, 2026: Several special festivals are scheduled to be held at the Sri Govindaraja Swamy Temple in Tirupati during the month of April. The details are as follows:

* April 10 and 24 (Fridays): At 6:00 PM, a procession of Sri Andal Ammavaru will be held along the four Mada streets of the temple.

* April 12 (Shravana Nakshatram): On the occasion of Shravana Nakshatram, Sri Kalyana Venkateswara Swamy, along with His consorts Sridevi and Bhudevi, will go on a procession through the four *Mada streets at 6:00 PM to bless the devotees.

* April 13 to 22: Sri Bhashyakarla Utsavam (Festival of Sri Ramanujacharya) will be conducted.

*  April 20 (Rohini Nakshatram): On the occasion of Rohini Nakshatram, Sri Parthasarathi Swamy, along with Rukmini and Satyabhama, will go on a procession through the *Mada streets at 6:00 PM to bless the devotees.

*  April 21 to 30: Sri Madhurakavi Alwar and Sri Anantalwar Utsavam will be organized.

*  April 23: Sri Bhashyakarla Gandhapu Podi Utsavam (Sandalwood Powder Festival) and the Thirunakshatram (Birth Anniversary) of Sri Mudaliyandan Swamy (Dasharathi) will be observed.

* April 28 to 30: Buggotsavam will be celebrated at the Sri Govindaraja Swamy Temple.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

ఏప్రిల్‌లో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2026 ఏప్రిల్ 04: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

•  ఏప్రిల్ 10, 24వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

•  ఏప్రిల్ 12వ తేదీ శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీభూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భక్తులను అనుగ్రహిస్తారు.

•  ఏప్రిల్ 13 నుండి 22వ తేదీ వ‌ర‌కు శ్రీ భాష్య‌కార్ల ఉత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు.

•  ఏప్రిల్ 20న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.

•  ఏప్రిల్ 21 నుండి 30వ తేదీ వ‌ర‌కు శ్రీ మధురకవి ఆళ్వార్, శ్రీ అనంతాల్వార్ ఉత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు.

•  ఏప్రిల్ 23న  శ్రీ భాష్య‌కార్లవారి గంథ‌పుపొడి ఉత్స‌వం, శ్రీ ముదలియాండాన్ స్వామి వారి (దాశరథి) తిరునక్షత్రం.

–  ఏప్రిల్  28 నుండి 30వ‌ తేదీ వ‌ర‌కు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుగ్గోత్సవం.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.