SPECIAL FESTIVALS AT SRI KODANDARAMA SWAMY TEMPLE, TIRUPATI IN JANUARY _ జనవరిలో తిరుప‌తి శ్రీ కోదండ‌రామాల‌యంలో విశేష ఉత్స‌వాలు

Tirupati, 26 December 2025: Several special festivals will be conducted at Sri Kodandarama Swamy Temple, Tirupati, during the month of January. The details are as follows:

On January 3, 10, 17, 24, and 31 (Saturdays), Abhishekam to the presiding deities Sri Sita, Rama, and Lakshmana will be performed at 6:00 a.m., followed by Unjal Seva at 5:00 p.m.

On January 3, on the occasion of Pournami, Ashtottara Satakalasa Abhishekam will be performed at 9:30 a.m.

On January 4 and 31, in connection with Punarvasu Nakshatram, Sri Sita Rama Kalyanam will be performed at 11:00 a.m.

On January 18, on the occasion of Amavasya, Sahasra Kalasa Abhishekam will be performed at 8:30 a.m.

Later in the evening, Hanumantha Vahana Seva will be conducted at 7:00 p.m.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

జనవరిలో తిరుప‌తి శ్రీ కోదండ‌రామాల‌యంలో విశేష ఉత్స‌వాలు

తిరుపతి, 2025 డిసెంబ‌రు 26: తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో జనవరి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

• జనవరి 3, 10, 17, 24, 31వ‌ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం, సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

• జనవరి 3న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు.

• జనవరి 4, 31వ తేదీల‌లో పున‌ర్వ‌సు న‌క్ష‌త్రాన్ని పుర‌స్క‌రించుకుని ఉద‌యం 11 గంట‌ల‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం నిర్వ‌హిస్తారు.

• జనవరి 18న అమావాస్య సందర్భంగా ఉదయం 8.30 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగనుంది. రాత్రి 7 గంట‌ల‌కు హ‌నుమంత వాహ‌న‌సేవ నిర్వ‌హిస్తారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.