SPECIAL FESTIVALS IN SRI GOVINDARAJA SWAMY TEMPLE IN APRIL _ ఏప్రిల్‌ నెలలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, 28 March 2025: Many special festivals will be observed in the month of April at  Sri Govindaraja Swamy temple in Tirupati. Their details are as follows.

 – On the occasion of Rohini Nakshatra, on April 03, at 6 pm, Sri Parthasaradhi Swamy along with Rukmini and Satyabhama, will go on a procession to bless devotees along the Mada streets.

 – On April 04 and 18 on Fridays at 6 pm a procession of Sri Andal Ammavaru takes place

 – procession of Sri Pattabhirama Swamy along with Sri Sita Lakshmana Anjaneya on the occasion of Sri Ramanavami on April 06.  

 – On April 12, on the occasion of the full moon and Uttara Nakshatra, Sri Govindaraja Swamy will take ride on the Garuda.

 – In the advent of Shravana Nakshatram on April 22, the Sri Bhu Sameta Sri Kalyana Venkateswara Swamy procession takes place

 – Bhashyakarla Utsavam from April 23 to May 02.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్‌ నెలలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2025 మార్చి 28: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– ఏప్రిల్ 3న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామి వారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.

– ఏప్రిల్ 4, 18వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

– ఏప్రిల్ 6న శ్రీ రామనవమి సందర్భంగా సాయంత్రం శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీపట్టాభిరామస్వామి వారు మాడ వీధుల్లో భక్తులకు అభయమిస్తారు.

– ఏప్రిల్ 12న పౌర్ణ‌మి మ‌రియు ఉత్త‌ర న‌క్ష‌త్రం సంద‌ర్భంగా సాయంత్రం గ‌రుడ వాహ‌నంపై శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు విహ‌రించి భ‌క్తుల‌ను అనుగ్ర‌హించ‌నున్నారు.

– ఏప్రిల్ 22వ తేదీ శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీభూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భక్తులను అనుగ్రహిస్తారు.

– ఏప్రిల్ 23 నుండి మే 2వ తేదీ వ‌ర‌కు భాష్య‌కార్ల ఉత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.