SPIRITUAL BOOKS RELEASED _ క‌ల్ప‌వృక్ష వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ

TIRUMALA, 07 OCTOBER 2024: In front of Kalpavriksha vahana seva on Monday, TTD EO Sri J Syamala Rao along with the Additional EO Sri Ch Venkaiah Chowdary released four spiritual books.

The books includes Rayalaseemaloni Prasiddha Devalayalu by Sri P Krishnamurthy, Vasudasu Keertanalu by Sri Vasudasu Swamy, Bhagavat Gitai Kathaigal-Bhaktium Muktium in Tamil by Dr Harikesavan, Harivamsa in Kannada by Dr Ravindra Kushtagi.

Later the EO and Additional EO felicitated the authors.

JEOs Smt Goutami, Sri Veerabrahmam and others were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

క‌ల్ప‌వృక్ష వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ

తిరుమల, 2024 అక్టోబ‌రు 07: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమ‌వారం ఉదయం క‌ల్ప‌వృక్ష‌ వాహనసేవలో నాలుగు ఆధ్యాత్మిక పుస్తకాలను టిటిడి ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు, అద‌న‌పు ఈవో శ్రీ సిహెచ్ వెంక‌ట‌య్య చౌద‌రితో క‌లిసి ఆవిష్కరించారు.

రాయలసీమలోని ప్రసిద్ధ దేవాలయాలు

•⁠ ⁠శ్రీ పి. కృష్ణమూర్తి

అనాది కాలం నుండి ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి తత్త్వానికి భారతావని పెట్టింది పేరు. ప్రజల మధ్య ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంబంధాలు కొనసాగుతున్నాయి. ‘రాయలసీమలోని ప్రసిద్ధ దేవాలయాలు’ అనే ఈ గ్రంథలో చిత్తూరు, కడప, కర్నూలు మరియు అనంతపురం జిల్లాలలోని దేవాలయాల గురించి, వాటి చరిత్ర, నిర్మాణాలు, ఉత్సవాల గురించి క్షుణ్ణంగా వివరించబడింది.

వాసుదాసు కీర్తనలు

•⁠ ⁠శ్రీ వాసుదాసుస్వామి

శ్రీమదొంటిమిట్ట కోదండరామస్వామిని కీర్తిస్తూ భజన సంప్రదాయంలో దాదాపు 128 కీర్తనలను రచన చేశారు. వీటినే భక్తలోకం వాసుదాసు కీర్తనలుగా కీర్తిస్తున్నాయి. ‘వాసుదాసు కీర్తనలు’ అనే ఈ గ్రంథంలో గణపతి, లక్ష్మి, సరస్వతి, పార్వతి మున్నగు దేవీదేవతలతోపాటు శ్రీరామచంద్రునికి సంబంధించిన కీర్తనలు ఉన్నాయి.

భాగవత కథైగళిల్‌ భక్తియుం – ముక్తియుం (తమిళం)

•⁠ ⁠డా॥ హరికేశవన్‌

సర్వోపనిషత్సారం – భాగవతం జ్ఞాన-భక్తి-వైరాగ్య ప్రధానమైన గ్రంథం. శ్రీమద్భాగవతం 18 వేల శ్లోకాలు, 12 స్కంధాలతో కూడుకున్న హయగ్రీవ బ్రహ్మవిద్య. ఇంతటి మహత్తరమైన భాగవతాన్ని శ్రవణం చేయడానికి దేవతలు కూడా మానవజన్మను పొందాలని ఆశిస్తారు. అష్టాదశపురాణాలలో శ్రీ భాగవతమహాపురాణం మోక్షప్రదాయకమైనది.

శ్రీమద్భాగవతంలోని వివిధ భక్తుల కథలను విశ్లేషణాత్మకమైన రీతిలో డా॥ హరికేశవన్‌ గారు సులభమైన తమిళభాషలో రచన చేశారు.

హరివంశ (మహాభారత ఖిలాభాగ) (కన్నడ)

•⁠ ⁠డా॥ రవీంద్ర ఎ కుష్టగి

మహాభారతంతో పాటు హరివంశము కూడా పారాయణం చేస్తేనే సంపుటీకరణమవుతుందని మన పూర్వీకులు చెబుతారు. మహాభారతం చతుర్వేదసారం పంచమవేదంగా కీర్తించబడినది. మహాభారతంలో ఉన్నదే ఈ లోకంలో ఉన్నది. మహాభారతంలో లేనిది ఈ లోకంలోనే లేదు. అటువంటి మహాభారతం యొక్క ఖిల భాగమే హరివంశం. ఇందులో మొత్తం 47 పర్వాలున్నాయి. హరివంశపర్వాలు 14, విష్ణుపర్వాలు 21, భవిష్యపర్వాలు 12 ఉన్నాయి. ఈ గ్రంథానికి చివరన హరివంశ సృష్టి చిత్రణ పట్టిక కూడ చేర్చబడిరది.

ఈ కార్యక్రమంలో జెఈవోలు శ్రీ‌మ‌తి గౌత‌మి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు శ్రీ విభీష‌ణ శ‌ర్మ‌, ఉప సంపాదకులు డా|| నరసింహాచార్య పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.