SPIRITUAL BOOKS RELEASED _ కల్పవృక్ష వాహన సేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
TIRUPATI, 13 NOVEMBER 2023: In front of Kalpavriksha Vahana Seva on Monday, TTD JEO Sri Veerabrahmam has released three spiritual books.
Sri Venkateswara Sachitra Suprabhatam in English and Hindi, Hindi Sahityamlo Neelamegha Syamudu by Sri Ramanuja Bhattar.
DyEO Sri Govindarajan, Special Officer Publications Dr Vibhishana Sharma, Sub-editor Dr Narasimhacharya were also present.
కల్పవృక్ష వాహన సేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ
తిరుపతి, 2023 నవంబరు 13: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజైన సోమవారం ఉదయం జరిగిన కల్పవృక్ష వాహన సేవలో మూడు ఆధ్యాత్మిక పుస్తకాలను టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం ఆవిష్కరించారు.
శ్రీ వేంకటేశ్వర సుచిత్ర సుప్రభాతం (ఇంగ్లీష్, హిందీ)
తిరుమల శ్రీవారి ఆలయం తెరచినప్పటి నుండి జరిగే సేవలలో సుప్రభాత సేవ ఎంతో విశిష్టత మైనది. సుప్రభాత సేవలో ప్రతి శ్లోకం రామాయణంలోనిది. పరమాత్మను సుప్రభాతంతో మేల్కొల్పడం ఒక అద్భుత ఫలితాన్ని ఇచ్చే వైదిక కర్మ. ఎందుకంటే స్వామి వారిది మిగతా జీవుల నిద్ర కాదు, అది యోగనిద్ర. ప్రతిరోజు శ్రీవారి ఆలయంలో పఠింపబడే ఈ సుప్రభాతాన్ని నేటి బాలబాలికలకు, యువకులకు అర్థమయ్యే రీతిలో ఆకర్షణీయమైన తైలవర్ణ చిత్రాలతో తాత్పర్య సహితంగా టీటీడీ ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందిస్తున్నది.
హిందీ సాహిత్యంలో నీలమేఘ శ్యాముడు :- కె రామానుజ భట్టర్
శ్రీహరి దశావతారాల్లో శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాల్లో ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నది. ప్రత్యేకించి ఉత్తర భారతీయ సాహిత్యంలో శ్రీరామ, శ్రీకృష్ణ అవతార లీలా విశేషాలకు అగ్రస్థానం ఇచ్చారు. వాల్మీకి రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ‘అవధి’ భాషలో ‘శ్రీరామ చరిత మానస్’ ను రచించారు. అలాగే వల్లభాచార్యుల సంప్రదాయంలో వచ్చిన ‘ సూరదాస్’ భాగవతాన్ని ఆధారం చేసుకుని ‘సూర్ సాగర్ ‘ వ్రజ్ భాషలో రచన చేశారు.
ఈ రెండు గ్రంథాలను తులనాత్మకంగా పరిశీలించి హిందీ సాహిత్యంలో నీల మేఘశ్యాముడు అనే గ్రంధాన్ని టీటీడీ భక్తులకు అందిస్తోంది.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ, ఉపసంపాదకులు డా. నరసింహాచార్య, రచయితలు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.