SPIRITUAL DANCE AND MUSIC ENTHRALLS _ మహాశివ రాత్రిలో మరింత ఆధ్యాత్మిక భక్తి భావాన్నిపెంచిన భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు

TIRUPATI, 15 FEBRUARY 2026: On the auspicious occasion of Maha Shivaratri, TTD organised a series of devotional music and cultural programmes on Sunday, creating a spiritually surcharged atmosphere for the devotees.

The programmes were conducted at Kapila Theertham, Mahati Kalakshetram, Annamacharya Kalamandiram and Ramachandra Pushkarini under the aegis of Hindu Dharma Prachara Parishad, SV College of Music and Dance, and Annamacharya Project.

The devotional programmes witnessed enthusiastic participation from devotees and locals, significantly enhanced the spiritual ambience on the sacred occasion of Maha Shivaratri.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

మహాశివ రాత్రిలో మరింత ఆధ్యాత్మిక భక్తి భావాన్నిపెంచిన భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు

తిరుపతి, 2026 ఫిబ్రవరి 15: మహాశివ రాత్రిలో మరింత ఆధ్యాత్మిక భక్తి భావాన్ని మ‌రింత పెంచేలా ఆదివారం టీటీడీ ప‌లు భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది.

ఇందులో భాగంగా తిరుపతిలోని కపిలతీర్థం, మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలో టీటీడీ హిందూ ధ‌ర్మ ప్ర‌చార‌ప‌రిష‌త్, ఎస్వీ సంగీత నృత్య కళాశాల, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

కపిలతీర్థంలో….  

కపిలతీర్థంలో శ్రీ‌మ‌తి ప్రసన్న లక్ష్మీ బృందం శివస్తోత్ర పారాయణం, శ్రీ ఆముదాల మురళి పురాణ ప్రవచనం, శ్రీ జగదీష్ బృందం లింగోద్భవ వైభవం నృత్య రూపకం, శ్రీ వేంకటేశ్వర్లు సతీ తులసి హరికథ, సంప్రదాయ పాఠశాల విద్యార్థినులు శివ భజనామృతం భ‌క్తుల‌లో మ‌రింత భ‌క్తి భావాన్ని పెంచాయి.

మహతి క్షేత్రంలో….

మహతి క్షేత్రంలో శ్రీ‌మ‌తి సరళ బృందం శివస్తోత్ర పారాయణం, శ్రీ ప్రభాకర్ శర్మ పురాణ ప్రవచనం, శ్రీ హరనాథ్ నేతృత్వంలో మోహినీ భస్మాసుర నృత్య రూపకం, శ్రీ‌మ‌తి జయంతి సావిత్రి ఆధ్వర్యంలో భక్త శిరియాళ హరికథ, సంప్రదాయ పాఠశాల విద్యార్థినులు శివ భజనామృతం నిర్వ‌హించారు.

అన్నమాచార్య కళామందిరంలో….

అన్నమాచార్య కళామందిరంలో శ్రీ‌మ‌తి ఇందిరా రాణి బృందం శివస్తోత్ర పారాయణం, శ్రీ‌మ‌తి నిర్మలా బాయ్ పురాణ ప్రవచనం, శ్రీ‌ అజయ్ కుమార్ బృందం పార్వతి పరిణయం నృత్య రూపకం, శ్రీ‌మ‌తి కృష్ణ కుమారి పార్వతి పరిణయం హరికథ, సంప్రదాయ పాఠశాల విద్యార్థినులు శివ భజనామృతం పుర‌ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకున్నాయి.

రామచంద్ర పుష్కరిణి…..

రామచంద్ర పుష్కరిణి వ‌ద్ద శ్రీ‌మ‌తి రాజకుమారి బృందం శివస్తోత్ర పోరాయణం, శ్రీ నారాయణ రావు పురాణ ప్రవచనం, శ్రీ కిషోరి బోస్ బృందం శివ లీలలు నృత్య రూపకం, శ్రీ రాముడు బృందం భక్త కన్నప్ప హరికథ, సంప్రదాయ పాఠశాల విద్యార్థినులు శివ భజనామృతం అల‌రించాయి.

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.