SPIRITUAL DEVOTIONAL TREAT _ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ఆధ్యాత్మిక శోభ
TIRUPATI, 03 DECEMBER 2024: The ongoing Karthika Brahmotsavam in Tiruchanoor have given the art lovers of Tirupati a huge treat with a variety of Spiritual devotional programs.
The HDPP wing, Annamacharya Project, SVCMD, SVIHVS all in combine have organised a wide range of classical devotional and spiritual programs in different venues.
The denizens appreciated all the devotional spiritual programs organised by TTD during Ammavari Brahmotsavams.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ఆధ్యాత్మిక శోభ
తిరుపతి, 2024 డిసెంబరు 03: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తిరుచానూరు ఆస్థానమండపంలో ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల ఆధ్వర్యంలో మంగళధ్వని, ఉదయం 6 నుండి 7.30 గంటల వరకు ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థకు చెందిన పండితులచే చతుర్వేద పారాయణం నిర్వహించారు
ఉదయం 10 నుండి 11 గంటల వరకు హైదరాబాద్ కు చెందిన సేతురామన్ ధార్మికోపన్యాసం, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నెల్లూరుకు చెందిన శ్రీ సురేష్ బృందం వారిచే భక్తి సంగీత కార్యక్రమం జరిగింది.
అనంతరం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి కృష్ణకుమారి బృందం హరికథ పారాయణం చేశారు. సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ ఆనంద భట్టర్ బృందం అన్నమయ్య సంకీర్తనలను సుమధురంగా గానం చేశారు.
అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 గంటలకు బెంగుళూరు సృష్టి సెంటర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ కు చెందిన డాక్టర్ సత్యనారాయణ బృందం నృత్య ప్రదర్శన, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 గంటల నుండి బెంగుళూరుకు చెందిన శ్రీమతి గీత బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.
శ్రీ రామచంద్ర పుష్కరిణి వద్ద సాయంత్రం 6:30 గంటలకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు, అధ్యాపకుల బృందం భక్తి సంగీతం, శ్రీమతి ప్రభావతి భరతనాట్యం నిర్వహించారు.
తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 గంటల నుండి ఏలూరుకు చెందిన డా.శ్రీనివాసులు బృందం నృత్య రూపకం ప్రదర్శించారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.