SPIRITUAL MUSIC PROGRAMS SPREAD DEVOTIONAL SPIRIT IN TIRUMALA _ తిరుమలలో భక్తి భావాన్ని పంచిన ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు

Tirumala, 09 October 2024: Devotional music programs organized by TTD Hindu Dharmic Projects at Tirumala Nada Neerajanam and Asthana Mandapam on Wednesday as part of Srivari Brahmotsavam brought spiritual joy to the devotees. 
 
A devotional music program by Dr. Pantula Rama group from Vizag from 4 to 5 pm amused the devout.
 
Vishnu Sahasranama Recitation by Srimati Vani Team from Hyderabad from 7 to 8 am in Asthana Mandapam, Devotional Music by Sri Udayabhaskar Srimati Lavanya Team from Tirupati from 10 am to 11:30 am impressed the devotees.
 
Later, from 4pm to 5.30 pm, Sri Balaji and Srimati Revathi’s team sang Annamayya Sankeertans melodiously.  
 
Then from 5:30 PM to 7 PM, Srimati Varalakshmi of Tirupati impressed with Harikatha.
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
 
 
 

తిరుమలలో భక్తి భావాన్ని పంచిన ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు

తిరుమల, 2024 అక్టోబ‌రు 09 ; శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం తిరుమల నాదనీరాజనం వేదిక, ఆస్థాన మండపంలో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి సంగీత కార్యక్రమాలు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించాయి.

తిరుమల నాద నీరాజనం వేదికపై ఉదయం 4:30 నుండి 5:30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు శ్రీ గణేష్, శ్రీ సాయి కుమార్, శ్రీ ఆదర్శ్, శ్రీ నవీన్ బృందం మంగళ ధ్వని, ఉదయం 5:30 నుండి 6:30 గంటల వరకు భద్రాచలంకు చెందిన శ్రీ కృష్ణమాచార్యులు ‘ సామనస్య సూక్తం – అథర్వణ’ వేదం అనే అంశంపై ఉపన్యసించారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు వైజాగ్ కు చెందిన డాక్టర్ పంతుల రమ బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.

ఆస్థాన మండపంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు హైదరాబాదుకు చెందిన శ్రీమతి వాణి బృందం విష్ణు సహస్రనామ పారాయణం, ఉదయం 10 నుండి 11:30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ ఉదయభాస్కర్ శ్రీమతి లావణ్య బృందం భక్తి సంగీతం, ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు చెన్నైకి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ ‘ధర్మో రక్షతి రక్షితః ‘ అనే అంశంపై భక్తి సందేశం అందించారు.

అనంతరం సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు శ్రీ బాలాజీ, శ్రీమతి రేవతి బృందం అన్నమయ్య సంకీర్తనలను సుమధురంగా ఆలపించారు. తర్వాత సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 వరకు తిరుపతికి చెందిన శ్రీమతి వరలక్ష్మి బృందం హరికథ గానం చేశారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.