SPIRITUAL PROGRAMS GETS THUMBS UP _ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో అలరించిన ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో అలరించిన ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు
తిరుపతి, 2024 నవంబరు 30: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి.
తిరుచానూరు ఆస్థానమండపంలో ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల ఆధ్వర్యంలో మంగళధ్వని, ఉదయం 6 నుండి 7.30 గంటల వరకు ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థకు చెందిన పండితులచే చతుర్వేద పారాయణం నిర్వహించారు
ఉదయం 10 నుండి 11 గంటల వరకు హైదరాబాద్ కు చెందిన శ్రీ పరకాలన్ బృందం ధార్మికోపన్యాసం, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీమతి ఆర్తి బృందం వారిచే భక్తి సంగీత కార్యక్రమం జరిగింది.
అనంతరం మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి విజయ కుమారి బృందం హరికథ పారాయణం చేశారు. సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి బుల్లెమ్మ బృందం అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు ఊంజల సేవలో తిరుపతికి చెందిన శ్రీ శివరత్నం బృందం అన్నమయ్య సంకీర్తనలను సుమధురంగా గానం చేశారు.
అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 గంటలకు తిరుపూర్ కు చెందిన శ్రీ నరసింహారావు బృందం భక్త రంజని, ఇతర కళాకారులచే కూచిపూడి నృత్యం, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 గంటల నుండి తిరుపతికి చెందిన శ్రీ బి.ఎన్.రెడ్డి భరత నాట్యం ప్రదర్శించారు.
శ్రీ రామచంద్ర పుష్కరిణి వద్ద సాయంత్రం 6:30 గంటలకు తిరుపతికి చెందిన శ్రీ లలిత హయగ్రీవ నారాయణ ఆచార్యులు భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.
తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 గంటల నుండి శిల్పారామంలో శ్రీ బాలాజీ బృందం లయ విన్యాసం మరియు భరతనాట్యం ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.